సాహితి

పిట్టగూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరమరికల లోతులు తట్టే
అరుదైన నైపుణ్యం
ఇంటి చూరైనా- చెట్టు రెమ్మల సంగమమైనా
స్థల సేకరణలో చాకచక్యము
పరక పోగులు, కట్టె పుల్లలు
అంపశయ్య మీద అనువైన అమరికలు
రెండు పక్కలు
స్వయం చోదక విమానం రెక్కలు
ముక్కుకు చిక్కిన గడ్డిపరక
ఒక్కొక్కటే చేరవేత
గుత్తేదారు పత్తా- మేస్ర్తి ఆధిపత్యం
పనికిరావని పాడుతుంది స్వయంకృషి
ఎన్ని పుల్లలో- మరెన్ని పరకలో
నిర్మాణ కళకు నిండైన ఆకర్షణ
తుర్రుబుర్రు చిన్నారి పిట్ట కౌశలం
అల్లసాని పెద్దన అల్లిక జిగిబిగి లాంటిది
మానవ మాత్రులకందని మహాకట్టడంలో
స్వచ్ఛ మనసుల వెచ్చని కాపురం,
సంసారానికి సరిపోతే చాలు
గుడ్లు పెట్టడం- పొదగడం,
పిల్లల పెంపకానికి హద్దుల పద్దులు
ఉదయాకాశం రంగుల స్నానానికి ముందే
పిట్టగూటిలో పిల్లల పీచు- పీచులు
సభ్య సమాజానికి మేలుకొలుపులు
కూడు- గుడ్డ- గూడు ఆశలకంతులేని
మనిషి పాలిట ‘‘ఆదర్శ నిలయము’’.

- ఐతా చంద్రయ్య, 9391205299