సాహితి

ఉగాది పద్య, గేయ రచనా పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేవళంబి నామ ఉగాది సందర్భంగా గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పద్య, గేయ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్. రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది సందర్భంగా నిర్వహించే సాహితీ వసంతోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలలో ఒకదానిపై స్వేచ్ఛా ఛందస్సులో ఐదు పద్యాలు వ్రాసి పంపాలి. గేయం కూడా సమకాలీన అంశాల్లోనే ఒక పేజీకి మించకుండా వుండాలి. రచయతలు, స్వీయ రచన అనీ, అనువాదం కాదని రచయతలు హామీ పత్రం జతచేయాలి. రెండు విభాగాల్లో వేర్వేరుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రం ఇవ్వబడతాయ. రచనలను మార్చి 10వ తేదీలోగా సాహితీ సమాఖ్య కార్యాలయం, ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్, 4/19, బ్రాడీపేట, గుంటూరు (్ఫన్ 0863-2233291) కార్యాలయానికి పంపించాలని ప్రకటనలో కోరారు.
**

దేవరాజు మహారాజుకు
వుప్పల లక్ష్మణరావు అవార్డు
ఆధునిక సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన అభ్యుదయ రచయిత, హేతువాది, మానవతావాది డా.వుప్పల లక్ష్మణరావు వర్ధంతిని పురస్కరించుకుని విశాఖ రచయితల సంఘం ప్రప్రథమ స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారానికి ప్రఖ్యాత కవి, కథకులు, నాటక కర్త, అనువాదకులు, సైన్స్ రచయిత డా.దేవరాజు మహారాజును ఎంపిక చేయడం జరిగిందని సంస్థ ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 22న విశాఖ పౌర గ్రంథాలయంలో డా.దేవరాజు మహారాజుకు పురస్కారంతోపాటు నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో సత్కరించబడును.
**

‘శతాధిక కవుల’
ఏకదిన కవి సమ్మేళనము
రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలకు సంబంధించి కవిత్వం రాస్తోన్న వారికి, రాసిన వారికి, రాయాలనుకుంటున్న వారికి సాంస్కృతీ సమాఖ్య (యువ సాహితీ వికాస వేదిక) ఆహ్వానం పలుకుతోంది. వారు రాసిన మంచి కవితలను ఎంపిక చేసి, అవి రాసిన కవులతో ‘శతాధిక కవుల ఏకదిన కవి సమ్మేళనం’ విజయవాడలో ఏర్పాటుచేసే సంకల్పం వుంది. కవితల్లో సమకాలీన పరిణామాలు, పరిస్థితుల నేపథ్యం వుండాలి. ప్రగతిశీల చైతన్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కవితలు మానవీయ కోణంలో వ్రాసినవి మూడు విభిన్న కవితలు పంపాలి. ‘ఏకదిన కవి సమ్మేళనము’లో పాల్గొనాలనే అభిలాష వున్న కవులు వివరాలకోసం సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ వి.శిరీష్‌కుమార్, సాంస్కృతీ సమాఖ్య, నున్న- 521 212 (వయా) విజయవాడ చిరునామాకు పోస్టుకార్డు వ్రాయండి.