సాహితి

మేరక.కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది యవన రాజ్యం
వనల రాజ్యం
ఎవ్వరైనా ఇక్కడ యవ్వనులే
ఇక్కడి వినోదాలపై బ్రతుకుతోంది ప్రపంచమో సగం
ఇక్కడి వినోదంకోసం తన్నుకుఛస్తోంది ఇంకో సగం
ఇక్కడ చావుకూ వినోదానికి పెద్ద తేడా లేదు
ఆడుకోటానికి వాల్‌మార్టుల్లో
దొరుకుతాయ్ స్టెన్ గన్నులు
తెలుపు నలుపు కుర్రకారుకు
అవే అంతులేని ఫన్నులు
అసహనం, అహంకృతి కలిసి ఆడుకొంటుంటాయి
అంతర్జాతీయ వేదికపై ‘తొక్కుడు’ బిళ్లలాటలు
ఆకాశమంత ఎతె్తైనది దీని ప్రాభవం
అవనీ, అంతరిక్షంపై తనదే ఆధిపత్యం
ఇది అ-మేరక
‘మేర’లు దేనికో తెలియని ప్రహేళిక
ఉడత కూడా ఇక్కడ కుందేలంత
అడుగడుగున కనువిందు చేసే వింత
రెండొందలేళ్ల గొప్పని గొప్పగా చెప్పే ఘనత
బాల యవ్వనులు, నవ వనలు,
ప్రౌఢ వనలు, పెద్ద యవ్వనులు,
మాట తేడానే; మనసు తేడా లేదు
వయసడుగుట తగదు; సంస్కారం కాదు..
ఇది నిరతోత్సాహ వన ప్రదర్శనశాల
బహనాగరకతల సంగమ కేళీ విలోల..
ఇది అన్ని జాతిమొక్కల సుందరోద్యానవనం
అంటుగట్టుట ఇక్కడి స్వాభావిక హృదయ ధర్మం
ఇక్కడ ప్రేమా, స్వాతిశయం పక్కపక్కనుంటాయ్
నిరాడంబరత, నార్సిజం ముడిపడుతుంటాయ్
అమాయకత్వం, చురుకుదనం జతకడుతుంటాయ్
వ్యక్తినవ్యక్తిత్వం చదరంగం ఆడుకొంటుంటాయ్
సగటు ప్రజకు ఇక్కడ వినోదమే తారక మంత్రం
ప్రపంచమే ఓ వినోద విలాస విహార క్షేత్రం..
అణచివేత, ఐశ్వర్య సాధనల మహచ్చరిత్ర
వాణిజ్య ప్రతిభ సృష్టించిన సంస్కృతి ‘జాత్ర’..
ఇది ఆదిమత, ఆధునికతలు సమసించినచోటు
ఆదర్శం, అధికారం చెట్టాపట్టాలేసుకొన్న చోటు
ప్రజాస్వామ్యానికి పెట్టని కోటలా మారిన చోటు
ఇది అ-మేరక
అవకాశాలకు మెరక
అతి నాజూకుల చిలక..
పట్టపగలు ఇక్కడ వీధులు
అర్థరాత్రి దొంగలు పడ్డట్లుంటాయ్
మనుష్యుల్ని కార్లు దోచుకుపోతుంటాయ్..
ఇక్కడ ప్రతి ఇల్లూ ఒక ద్వీపం
ప్రతిమనిషీ ఒక ద్వీపకల్పం
అదృష్టం!.. ఓ వైపైనా
పలకరింపు చోటుంది!!

- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, 9441809566