సాహితి

తీరా నది వెళ్ళిపోయాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండిన గొంతులు పొలాలు
కాలువలు నదులు
ఎదురుచూస్తుంటాయి
ప్రార్ధిస్తుంటాయి
కరుణించని వర్షాన్ని
కనికరం చూపమంటూ-
ఫ్యాక్టరీ ఆరంభానికి సైరన్ కూతలా
ఉరుము వురిమి
మేఘం ప్రసవించిన చినుకులు
వెండి దారాల్ని అల్లుకుంటూ
నేలకు నగ్నంగా జారుతాయి!
వర్షానికి వస్త్రాలుండవు
మనిషి కంటపడే లోగా
మట్టి గుడ్డల్ని చుట్టుకుని
మానం కప్పుకుని
కాలువలై ప్రవహిస్తూ
సంగతులకందని సంగీతం పాడుతుంది!
వర్షాన్ని వర్ణిస్తూ కవులు
అమృత భాండం అందినదంటారు
చినుకుల్ని చిత్రిస్తూ
చిత్రకారులు చంద్రలోహ వర్ణాలంటారు
గళమెత్తిన గాయకులు
వరుణుడి లయ విన్యాసమంటారు!
వర్షానికి రాగద్వేషాలున్నాయి
కోస్తాలో కుండపోతగా మారిన వర్షం
రాయలసీమలో
బట్ట తడవని చినుకౌతుంది
వర్షానికి అస్పృశ్యత వుంది
మాగాణ్ని చుంబించిన వర్షం
మెట్ట పైరు మేను తాకదు
వర్షానికి ముందు వెనకలు తెలియవు
ఏరువాకను విస్మరించిన వర్షం
కొండ కోనల్ని ముంచుతుంది!
నీటి పంపకంకోసం
కలాలు కాగితాల్ని పట్టి కూర్చుంటాయి
కూడికలు తీసివేతలు
గుణకారాలు భాగహారాలు
ఎంతకూ కుదరని బేరాలై
గూళ్ళకు చేరుకుంటాయి!
నిండిన నదులు పొర్లిదొర్లి
నడకై పరుగై నాట్యమై సింధువులో కలుస్తాయి!
అడుగంటిన గుంటలు బావులు
చెరువులు జలాశయాలు
ఎదురుచూస్తూ ప్రార్ధిస్తూ
మళ్ళీ... మళ్ళీ...

- అడిగోపుల వెంకటరత్నమ్, 9848252946