సాహితి

దక్షిణ భారత దార్శనికుడు కాలిన్ మెకంజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో బ్రిటీష్ పాలనాకాలంలో, అందరు అధికారులూ పరాయి పాలకుల్లాగా ప్రవర్తించలేదు. తమ తమ ఉద్యోగ విధుల పరంగా గాని, ఇతరత్రా అభినివేశంతోగాని, మన ప్రాచీన నాగరికతను, సంస్కృతినీ త్రవ్వితీశారు! వ్యవసాయ, ఆర్థికాభివృద్ధులకు ఎనలేని కృషి చేశారు. దేశ సాహిత్య పెంపునకు తోడ్పడ్డారు! అప్పుడు వారే కనుక అలాంటి అవిశ్రాంత కృషి చేసి వుండకపోతే, ఇప్పటి దేశ పరిస్థితులెలా వుండేవో అనిపిస్తుంది. ఈ పనులన్నింటినీ వారు వ్యాపార దృష్టితోకాని, వ్యక్తిగత లాభం కోసం గాని చేయలేదు. దేశ ప్రజల కోసమే చేశారు! దక్షిణ భారతదేశ అభివృద్ధికి కృషిచేసిన ఇంగ్లీషు అధికారుల్లో సి.పి.బ్రౌన్, సర్.ఆర్థర్ కాటన్, కల్నల్ కాలిన్ మెకంజీ ముఖ్యులు! వీరందరి కృషివల్ల, ప్రపంచ ప్రధాన నాగరికతా స్రవంతిలో దక్షిణ భారతదేశం భాగం అయింది.
కలోనెల్ కాలిన్ మెకంజీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంలో మొట్టమొదటి ‘సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా పనిచేశారు. ఆయన ఉద్యోగ విధులేవైనా, దక్షిణ భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని దర్శించి, లోకానికి చూపిన పరిశోధకుడాయన! టిప్పు సుల్తానుపై జరిగిన మూడవ మైసూరు యుద్ధంలో మెకంజీ మిలటరీ ఇంజనీరుగా పనిచేశారు. టిప్పు సుల్తాన్ 1799లో ఓడిపోయిన తర్వాత, మైసూరులోని కొన్ని ప్రాంతాలను సర్వే చేయడానికాయనను బ్రిటీష్, ఈస్టిండియా కంపెనీ నియమించింది. కీ.శ. 1800 సం.లో హైదరాబాద్ నిజామ్ రాయలసీమకు చెందిన 5 దత్తమండలాలను కంపెనీ ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. ఈ జిల్లాలను కూడా సర్వే చేయడానికి మెకంజీని నియమించారు. ఆ సమయంలోనే మెకంజీకి రాయలసీమ జిల్లాల సంస్కృతి, స్థానిక చరిత్రల గురించి పరిచయం కలిగింది. అలాంటి విషయాల్లో ఆసక్తిగల ఆయన ఆ ప్రాంతపు సంస్కృతి, స్థానిక చరిత్రలు, గత పాలనా పద్ధతుల గురించి లోతుగా అధ్యయనం చేశారు. తాను చేసిన ఈ పరిశోధనలో స్థానికంగా వున్న కావలి సోదరుల సహాయాన్ని తీసుకున్నారు. ఆ సోదరులలో పెద్దవాడైన కావలి బుర్రయ్యగారు తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృతం, మలయాళ భాషల్లో మంచి ప్రావీణ్యం వున్నవారు! ఆయన మంచి పండితుడు కూడా! రాయలసీమలో వృద్ధులను, ఇతరులను కలిసి, మెకంజీ స్థానిక (గత) చరిత్రలను చెప్పించుకునేవారు. వారు మాట్లాడే స్థానిక మాండలిక తెలుగు అర్థం చేసుకోవడానికి, కొన్ని వివరణలివ్వడానికీ బుర్రయ్యగారు తోడ్పడేవారు. అటువంటివారు చెప్పిన కథనాల్లో ఏవైనా కల్పనలు, అతిశయాలూ వుంటే మెకంజీ తొలగించి సాధ్యమైనంతమేరకు వాస్తవాలకు దగ్గరగా వ్రాసేవారు. ఆ విధంగా ఆయన ‘కైఫీయత్తులు’ వ్రాశారు. అవి ఇప్పటికీ, ఎప్పటికీ చరిత్ర, సంస్కృతి అధ్యయనాలకు ఉపయోగపడతాయి. ‘‘్భరతీయ విజ్ఞానాన్ని బుర్రయ్యగారు నాకు పరిచయం చేశారు’’ అని మెకంజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
మెకంజీ, సర్వేకొరకు కాని, ఇతర విధుల నిర్వహణకుగాని ఎక్కడికి, ఎప్పుడు వెళ్లినా, ఆ ప్రాంతంలో నిక్షిప్తమై వున్న చారిత్రక విశేషాలను, సాంస్కృతిక వారసత్వాన్ని, సాహిత్యపరమైన వాటికోసమూ అనే్వషిస్తూనే వుండేవారు. పురాతన కన్నడ లిపిని, వ్రాతప్రతులనూ చదవటంలో ఆయనకు మేలూరు ధర్మయ్యగారు కూడా సహకరించారు. తన పరిశోధనలోనూ, అనే్వషణలోనూ సహకరించినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపేవారు.
దక్షిణ భారతదేశ చారిత్రక ప్రాముఖ్యతను చాటే హంపి విజయ నగర శిథిలాలను మొదటిసారి వెలుగులోకి తెచ్చింది మెకంజీయే. 1799లో ఆయన సర్వే పనిమీద వెళ్లినపుడు, ఆ శిథిల నగరాన్ని చూశాడు. ఆ ప్రాంతమంతా మొక్కలతోనూ, రుప్పలతోనూ నిండి వుంది. చాలాకాలం నుండీ ఎవరూ కూడా దానిని పట్టించుకోలేదు. ఆయనా మొక్కలకు పాదులను తీయించేవాడు. రాళ్ళతో చెక్కబడి నిర్మించబడిన ఒక అద్భుతమైన నగరమక్కడుండేదని గుర్తించాడాయన. వాటిలో కొన్ని ముఖ్యమైన కట్టడాల చిత్రాలనాయన వాటర్ కలర్స్‌లో చిత్రించాడు. మొత్తం హంపి వియనగరం పటాన్ని పెన్సిల్ స్కెచ్‌తో గీసారాయన. ఆ స్కెచ్ ఇప్పుడు బ్రిటీష్ మ్యూజియంలో వుంది. గుంటూరు జిల్లాలోని అమరావతి నగరాన్ని (ఇపుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నిర్మాణమవుతున్న ప్రాంతం) కూడా ఆయన సందర్శించాడు. అది బౌద్ధక్షేత్రమని గ్రహించాడు. అక్కడున్న ముఖ్యమైన కట్టడాల స్కెచెస్ గీసాడాయన. అలాగే మహాబలిపురం కట్టడాల స్కెచెస్‌ను కూడా గీసాడు. ఇటువంటి స్కెచెస్, పటాలన్నీ కూడా బ్రిటీష్ లైబ్రరీలో వున్నాయి.
మెకంజీ గొప్ప సర్వే నిపుణుడు కనుక, దక్షిణ భారతదేశ నైసర్గిక పటాన్ని (మాప్) ఆయన మొదటిసారిగా తయారుచేశాడు. ఆయన 8000పైగా శాసనాలను సేకరించారు. ఆయన సేకరించిన ప్రాచీన వ్రాతప్రతులు 1500. స్థలపురాణాలు 2159. చరిత్ర పుటాలు 2000. ఆయన తయారుచేసిన పటాలు (మాప్స్), గీసిన చిత్రాలు 2,5630. సర్వే చేసి తయారుచేసిన ప్లానులు 79.
అమూల్యమైన వీటన్నింటినీ సేకరించడంలో ఆయన పడిన శ్రమ, కృషి అసమానమైనది! మెకంజీ అన్నగారు అలెగ్జాండర్, సోదరి మేరీ యొక్క వంశీకులిప్పటికీ వున్నారు. వారు ‘స్టోర్నొవే చారిత్రక సమాజం’ వారితో కలిసి, స్కాట్‌లాండ్‌లోని లూయిస్ కేజిల్‌లో కాలిన్ మెకంజీ జీవిత ప్రస్థానాన్ని తెలుపుతూ ఒక ప్రదర్శనను 2017 సం.లో ఏర్పాటుచేయాలని సంకల్పించారు.
దేశం, కాలం, రంగు మహనీయులైనవారికి వర్తించవు. వారు సర్వదా, సర్వత్రా వందనీయులు!

- మనె్న సత్యనారాయణ, 9989076150