సాహితి

అనంతం ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత చీకటిని రెప్పల మాటున దాచేదో తెలియదు గానీ
నిచ్చె మల్లి నిర్మలత్వాన్నీ, పారిజాత పరిమళాన్నీ
ఇంటి ముందు వేసే ముగ్గులో నింపి
ఉదయాలను స్వచ్ఛంగా చిత్రించేది

దిగమింగిన కన్నీళ్లెప్పుడూ
దుఃఖమై కురవడం చూడలేదు కానీ
కల్లోలాన్ని దాచిన గాంభీర్యతలో
మహా సముద్రంలా కనిపించేది

చిరునవ్వు తోరణాన్ని గుమ్మానికి కట్టి
ఆ ఇంటిని నిర్మించడానికి మూలస్తంభం అయనప్పుడు
ఆ సున్నితత్వంలో ఇమిడిన బలం
ఒక విభ్రమమే!

అన్ని అర్థాలనూ ఆకళింపు చేసుకున్న
నిశ్శబ్దం ఆమెలో ధ్వనించేదేమో!?
ఏ శబ్దాలను ఆశ్రయంచని
వౌనంతో సంభాషించేది చాలాసార్లు
మనసు వైశాల్యపు అంచులు తాకినట్లు
ప్రవహించే లోతులు తెలిసినట్లు
ఏ విశే్లషణలకూ తావు లేకుండా
మనుషుల్ని స్వీకరించేది

తమాయంచుకోవడానికి
ఎంతటి ఇంగితాన్ని అడ్డువేస్తుందో
ఆమె కోపావేశాలెప్పుడూ
ఎగురవేయని ప్రమాద హెచ్చరికలే

కొంత అస్పష్టంగా, పోల్చలేనట్లుగా
సాధారణత్వంలో
అనంతాన్ని మూర్త్భీవించినట్లుగా

- శశిశ్రీ, 7416399396