సాహితి

ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు కదలదు
మనుషుల కాళ్ళతో
బయటికి వెళ్లి వస్తుంది.
చక్రాలు లేకున్నా
దేశాలు సంచరిస్తుంది.
ప్రపంచాన్ని
ముక్కలుగా చేసి
ఇంటికి తీసుకొస్తుంది.
ఎన్ని కవితలు రాసినా
ఇంట్లో కొత్తవాటికి చోటిస్తుంది.

ఇల్లు అమ్మలాంటిది
ఆమె కొంగు పొడవు
రెండు గజాలే కావొచ్చు
కాని అది అనంతమైన
మమతల పతాకంలా వుంటుంది.

యుద్ధాలు గెలిచిన తర్వాత
వీరులు ఇంటికే వస్తారు
భయాన్ని జయించిన
ఆకలి జీవులు
ధైర్యసాహసాలను తెచ్చి
ఇంటి గూటిని వెలిగిస్తారు.
కరెన్సీ రద్దయినా
మానవ సంబంధాలతో నడిపిస్తారు.

ఇంటిలో మొలిచే స్వప్నాలు
సూర్యుణ్ణి అస్తమించకుండా
ఆపుతాయి.
కొత్త కిరణాలను చేతికిచ్చి
ఉదయానికి
సమాయత్తం చేస్తాయి.

ఇల్లంటే
కప్పూ గోడలు మాత్రమే కాదు
నలుగురు కూర్చొని
కష్టాలు కలబోసుకునే
బతుకు నీడ కూడా.

ఒక్కమాటలో చెప్పాలంటే
ఇల్లు సెంటిమెంటే కాదు
జీవన సమరంలో
ఆయింట్‌మెంట్ కూడా.

- డా. ఎన్. గోపి