సాహితి

భూగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళం
బాల్యం అరచేతిలో ‘గోళీకాయ’..
ఊహిస్తున్న అద్భుత లోకం గుప్పెట్లో ఉంది.
ఆదమరచి అలా నిద్రలోకి జారుకుంది.
జబుల్స్ గ్రహాల్లా తోస్తున్నాయి
సుతారంగా స్వప్నం నా చేతివేళ్లనందిపుచ్చుకుంది..
సత్యానే్వషణ మార్గంవైపు వినువీధిలో పయనం..
పాలపుంతలమధ్య రహదారుల్లో పరుగు!
ఎన్నో సౌర కుటుంబాల మైలురాళ్లను దాటుతున్నాం.
మరెన్నో గ్రహాల నీటి చలమల్లో స్నానమాడాం!
లెక్కలేనన్ని సూర్యచంద్రులను పలుకరిస్తున్నాం..
తారలన్నింటినీ స్పర్శించి పులకరించాం..
చివరిగా శనిగ్రహంపై నిలబెట్టి మాయమైంది ‘గోళీ’!
అంధకారంలో భూమండలాన్ని చూశా.
అంగారకుని భుజంపై చేయివేసి వంగి చూశా!
సప్తవర్ణ శోభిత లఘులోలకంలా అద్భుతం..
ఒడుపుగా రెండు వేళ్లమధ్యకి తీసుకున్నా
సూర్యునికి దగ్గరగాపెట్టి చూశా!
ఏడు ఖండాలు కరడుకట్టిన క్రౌర్యంతో..
రాయిలా మారిన మనోభావాలుగా గోచరించాయి.
దారిద్య్రం, హింస అంతర్యుద్ధాలతో అట్టుడుకుతోంది!
చుట్టూ విశ్వమంతా కలియచూశా..
మానవత్వమనే మంచినీటి మహాసముద్రం కోసం..
ఒక్క సునామీతో భూమండలాన్ని కడిగేద్దామని!
ఉద్యుక్తుడినై లేచి పట్టుతప్పి జారి భూలోకంలో పడ్డా!
కళ్లుతెరచి చూశా, గోళీ గెంతుకుంటూ జారిపోతోంది..
సౌరకుటుంబం నుండి మండుతూ విడిపోతూ..
విస్ఫోటనం చెందుతున్న గోళంలా!

- చంద్రహాస్, 9133366955