సాహితి

స్వేదనాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెమట చుక్కనెప్పుడూ
చులకన చెయ్యెద్దు
నుదుటి మీద రాతనే మార్చగలదు-
నుదురుపై మొలిచిన చెమట!
సేవకుడూ, కర్షకుడూ, శ్రామికుడూ....
వీళ్ళంతా భ్రమల్లో బతకరు-
శ్రమలోనే జీవిస్తారు!!
స్వేదం - ఒక వేదం....
కరకురాయిని పిండి చేసి
బీడుభూమిని పండించే మనోజ్ఞరాగం
శ్రమైక జీవన సౌందర్యానికి
నిలువెత్తు సత్యం
నరనరాన బిరాబిరా పరిగెత్తే రక్తఘోష నాదం
నెత్తురు- చెమట నాణేనికి రెండు ముఖాలు
సత్తువుని ఒకటి అందిస్తే
శత్రువుని రెండోది తరిమేస్తుంది!!
స్వేదాన్ని చిందించేవాడు-
ఆశల సౌధాన్ని చేరుకుంటాడు
సౌభాగ్యానందుకుంటాడు!
స్వేదాన్ని బంధించాలనుకునేవాడు-
అగాధంలోకి జారిపోతాడు
అనారోగ్యాన్ని తనలోనే దాచుకుంటాడు!!

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 9052116824