సాహితి

రూపుదాల్చిన సహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెను పురాణేతిహాసాలలో
తిరుగులేని ఆధిక్యతను ప్రతిష్టించి
వర్తమానంలో దగాచేస్తాం
అరచేతి వైకుంఠంలో
ఆకాశమంత ఎత్తున అధిష్టింపజేసి
ఆచరణలో అర్ధబానిసను చేస్తాం
నియమాలు, నిషేధాలు ఆమె చుట్టూ
సంకెళ్ళుగా బిగించి
మన పరిధికి హద్దులు చెరిపేసుకుంటాం
ఆమె బతుకులో కట్నాల కష్టాలు పేర్చి
ఆమెలో మానసిక అశాంతిని రగిలిస్తాం
ఐనా... ఆమె
రూపుదాల్చిన సహనమై
మోముపై చెరగని చిరునవ్వౌతుంది

ఏ తప్పు చేసిందనో...
చీటికి మాటికీ సిగ్గుతో ముడుచుకుపోతుంది
ఏ అపరాధం చేసిందనో...
వినయ విధేయతలతో అణిగిమణిగిపోతుంది.
పొద్దు పొడిచింది మొదలు ప్రొద్దుకుంకేవరకు
అలుపెరగని అవిశ్రాంత పనులలో
కూరుకుపోతుంది
అన్నీ ముగించుకుని పడగ్గది చేరేసరికి
చందమామ నడిజాము చేరుతుంది.
మళ్లీ తొలి కోడి కూయక మునుపే
వాకిట్లో ముగ్గై ప్రత్యక్షమవుతుంది
ఏ శాపానికి గురైనారనో..
ఈ వెట్టిచాకిరి సేవలు అందించడానికి.
తరతరాల ఒత్తిడికి
ఏర్పడిన ఆకృతేమో! ఈ స్ర్తిమూర్తి!

మన కష్టసుఖాలలో పాలుపంచుకొని
మన అడుగులో అడుగేస్తూ
మనకు తోడునీడై
జీవితం చివరి అంచుదాక నడుస్తుంది
మనం సాధించే
అద్భుత కార్యాల వెనుక ప్రేరణగా
మనకు సలహాలిచ్చే
అమాత్య పదవి నిర్వహిస్తుంది.
మనం ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు
ఆమె దయార్ద్ర హస్తాన్ని సాచి
మన వెన్నుతట్టి ధైర్యాన్ని నింపుతుంది.
కుటుంబాన్నంతటినీ సంతృప్తిపరుస్తూ
సంయమనం పాటిస్తూ
తాను నిప్పులపై నడకవుతుంది
ఎన్ని జన్మలెత్తి సేవిస్తే
ఆమె రుణం తీరుతుంది?

- కాశీవరపు వెంకట సుబ్బయ్య