సాహితి

కన్నీటి సంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుఃఖించే ప్రతి సందర్భంలో కారే కన్నీరు
అక్కరకు రాని అకాల వర్షం లాంటిది.
దుఃఖించే కారణం
మహాసముద్రమంత లోతైనదై ఉండాలి!
వ్యధ ఆవర్తనమై కొనసాగాలి.
పీడించే జ్ఞాపకాలు కన్నీటి సుడులై తిరగాలి.
దానికి దుఃఖం వాయువులా
తోడై గుండంలా మారాలి!
స్పష్టమైన వినీలాకాశం
మేఘావృతమై మసకేసినట్లు,
రెప్పచాటు యదార్ధం
అశ్రురూపధారియై అస్పష్టమవ్వాలి!
శోకతప్తమై కుమిలి కుమిలి ఉప్పొంగాలి..
స్వరం గద్గదమై ఉరుములూ ధ్వనిస్తేనే కదా..
జ్వలించే బాధ మెరుపై ప్రకాశిస్తుంది!
వెక్కిళ్ల పరంపరలు కెరటాలై ఎగసిపడాలి..
తరంగం అల్లకల్లోలమైనట్లు
అంతరంగం అతలాకుతలమై
హృదయం నీటిమబ్బులా బరువెక్కాలి...
అపుడే తలపులు ద్రవించి
ఏకధాటిగా వర్షిస్తాయి!
అంతర్మధనం పెనుతుపానై విరుచుకుపడాలి.
అప్పుడే సమస్య తీరం దాటి
మనసు ప్రశాంతిస్తుంది!
జీవిత తత్వం బోధపడుతుంది.

- కాళిదాస్ ఆనంద్