సాహితి

వ్యాఖ్యాన గ్రంథాలకు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రక్రియకు సంబంధించినా గత అయదేళ్లలో అచ్చయన వ్యాఖ్యాన గ్రంథాలను ద్వానా సాహితీ కుటీర పురస్కారాలకు పంపించాలని కినె్నర ఆర్ట్ ధియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ప్రతుల చొప్పున కింది చిరునామాకు మే 15వ తేదీలోగా పంపించాలి. పురస్కారం కింద పదివేల నగదు, జ్ఞాపిక అందజేయబడును. జూన్ 15న హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో కినె్నర ఆధ్వర్యంలో జరిగే ద్వానా సప్తతి ఉత్సవంలో పురస్కారాలు ప్రదానం చేయబడతాయని ఆయన వివరించారు. వ్యాఖ్యాన గ్రంథాలను డి. శశికాంత్, 101, ఆర్చీజ్ నెస్ట్, 1-1-428, గాంధీనగర్, హైదరాబాద్ - 500 080 అనే చిరునామాకు పంపించాలి.