సాహితి

పురిటి నొప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొందరపడొద్దు
నాటిన విత్తు మట్టితో మాట్లాడింది
తడితో సావాసం చేసింది
గాలిని ఆహ్వానించింది
విత్తు మొలకెత్తుతుంది
ఎటొచ్చీ, అరచేయి అడ్డేస్తావో
గెనంపై కూర్చొని సంరక్షణ చేస్తావో
మంచె పైకెక్కి కాపలా కాస్తావో-

తొందరపడొద్దు
చిత్తకార్తె చెరువు నింపింది
తూము నోరు తెరుచుకుంది
పరుగులు తీసే పంటకాలువకు
పారవొడ్డేసి మడికి మళ్ళించు
ఆత్రుత అవసరానికి మించి
నీరు నిలగట్టితే పైరు మురుగుతుంది-

తొందర పడొద్దు
ఊహించని రీతిలో పంట దిగుబడి వుంది
రెల్లరాలే స్థితి లేదు కంకిపచ్చగా ఉంది
కొడవలికి యిప్పుడే పని చెబితే
తరకలు రాలే ప్రమాదముంది -

తొందర పడొద్దు
కళ్ళంలో ధాన్యం పురిగట్టి వుంది
గిట్టుబాటు ధర అట్టడుగున వుంది
అమ్మకం కొనుగోలు మధ్య
దళారీ కనే్వయర్ బెల్టు అయ్యాడు
ప్రభుత్వం నిద్రలో వుంది
సుప్రభాతం పాడకు, నినాదమై నిద్ర లేపు.

- అడిగోపుల వెంకటరత్నమ్ సెల్: 9848252946