సాహితి

మనసును మూలంగా కదిపే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు కాళ్ల మేక
నవరసభరిత కథా సంపుటి
రచన: కల్లూరు రాఘవేంద్రరావు
ప్రచురణ:
శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,
హిందూపురం- 515201
పేజీలు: 152, ధర: రు.70/-
**
మేకకు నాలుగు కాళ్లు వుంటాయి. కాని యిది ‘మూడుకాళ్ల మేక’ కథ. నాలుగో కాలు చిరుతపులి పంజాకు చిక్కి లుప్తం అయిపోయింది. అయినా ఆ మేకకు బతుకుభారం అయినప్పుడు తను పోషించి పరిరక్షించిన యజమాని అన్నా, ఆ కుటుంబానికి చెందిన ‘శారదక్క’ అన్నా మక్కువ ఎక్కువ. ఒకరు తనను బతికించిన వారయితే, మరొకరు తన అస్వస్థత సమయంలో మందుమాకులు, మేతపోతలు యిచ్చి రక్షించినవారు. అటువంటివంటే శారదక్కకు తన విక్రయం ద్వారా వచ్చిన డబ్బు చేకూర్చే మందులవల్ల ఆరోగ్యం కుదటపడాలనీ, ఆమెకు గట్టి ఆయుస్సు పోయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే మహదానందంతో కటికవాని కత్తిని స్వాగతిస్తుంది. శారదక్కను ‘ఆసిన’కు గురిచేసి ఆస్పత్రిపాలుచేసిన నాగరాజు మీద కక్ష తీర్చుకోవడంకంటె, ఆమెకు త్వరగా ఆరోగ్యం కుదుటపడేట్లు చేయగల అవసరం అనే ‘విజ్ఞత’ను రుూ మూడు కాళ్ల మేక స్ఫురణకు తెచ్చుకుంటుంది. శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు వ్రాసిన యిరవయి రెండు కథల సమాహారం రుూ పుస్తకం. ఈ కథలన్నీ లోగడనే పత్రికలలో ప్రచురణఅయి చదువరుల ఆమోద ప్రమోదాలను సంపాదించినవే. ప్రతి కథ యేదో ఒక జీవిత సత్యాన్ని వెలికితీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. కథారచనలో తగినంత చాకచక్యాన్ని, ప్రతిభను సంతరించుకున్న రాఘవేంద్రరావు, పండిత కుటుంబానికి చెందినవారు. తండ్రిగారు అహోబలరావు 1931లోనే శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలను హిందూపురంలో స్థాపించి నడిపారు. ఈ సంస్థ యిప్పటికీ సాహిత్యసేవ చేస్తూ వుండడం అత్యంత ముదావహం. ముఖ్యంగా ‘నా పుస్తకం’అనే ప్రణాళిక ద్వారా చదువరులలో పుస్తక పఠనాపేక్షను యినుమడింపచేస్తున్న సాహిత్య సంస్థ యిది. కథలను, కథారచనను ప్రోత్సహించటానికి అనేక ప్రణాళికలు వున్న రుూ సంస్థ నెలనెలా కథాగోష్టులను కూడా నిర్వహిస్తూ వుంటుంది. రచన వ్యాసంగం, ప్రోత్సాహం క్షణక్షణానికి తగ్గిపోతున్న రుూ యాంత్రిక యుగంలో, మనస్సు- బుద్ధిలాంటి ఉదాత్త సముదాయాన్ని పెంచే సంస్థలు ప్రతి నగరంలోనూ వ్యాపించవలసి వుంది. దీనికి ఎక్కువ ప్రోద్బలంయిస్తూ రచనా వ్యాసంగాన్ని అవిరళంగా సాగిస్తున్న శ్రీ రాఘవేంద్రరావును అభినందిస్తూ వారి కృషి యింకా అనేక దీపాలను వెలిగించాలని కోరుకుంటున్నాను.
ఉత్తమ కథలను ఆప్యాయంగా చూచుకునే వారందరూ చదవవలసిన కథా సంపుటం యిది.

- ‘శ్రీవిరించి’