సాహితి

దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరం
బహుప్రమాదకరమైంది.
నువ్వొకటి తలిస్తే
వాళ్ళకు మరోటి అందుతుంది.
ఇక్కడ పూచిన పువ్వు
మన ఊరిలో
మరోలా పరిమళిస్తుంది.

పొద్దున ఫోన్ చెయ్యలేదు
ఉపద్రవ మేఘాలు ఉరుముకొస్తుంటాయి
దూరం ప్రేమ పరీక్షలు పెడుతుంది
అపోహలకు ద్వారాలు తెరుస్తుంది
అప్పుడప్పుడు
ఫోన్‌ను బయట పారేసి
ఈ కొండమీదికెక్కి
మన ఇంటిదాకా వినపడేటట్టు
ఆకాశం ఫెళఫెళా విరిగిపడేటట్లు
ఒక విరాట్ శబ్దంతో
అరవాలనిపిస్తుంది.

దూరాన్ని మైళ్ళతో లెక్కిస్తాము
గంటల్లో గణిస్తాము
ఈ క్షణంలో అక్కడ లేకపోవడమే
దూరానికి సారాంశం.
మనస్సులకు
దూరం లేదు అనుకుంటాము
అద్వైత భావగీతాలకు
పాదులు వేస్తుంటాము
ఇప్పుడే
ఈ తుమ్మెద మీద స్వారీచేస్తూ
అక్కడ వాలాలనిపిస్తుంది.

దూరం
నిన్ను ఎగరవేసే మనసు దారం
అక్షర పథాల్లో
భావుక విహారం.

- డా ఎన్.గోపి, 9391028496