సాహితి

హై‘క్లూ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ చూపు వెలుగురవ్వే!
నా కళ్ళల్లో
కోటి దీపోత్సవం

హృదయ పట్టకంలో
నీ రాక వెలుగురేఖ
నా మనసు.. ఇంద్రధనుసు

నా రుసరుసలన్నీ
ఇక రసగుల్లాలే
నీ గుసగుసలతో

మనసంతా నువ్వే
మరి చోటు లేకే
నీ చుట్టూ తిరుగుతోంది!

ఊరంతా అమావాస్య!
నాకు లేదు
నువ్వున్నావుగా.. పక్కన

చెకుముకి చూపుల
సంఘర్షణ!
వలపు మెరుపులు

సందేశాలూ..
సంక్షిప్తాలే!?
నానో యుగం కదా!

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి