సాహితి

ఎండమావుల్లో నీళ్లు తాగినవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూర్ఖుడి వేదాలు వేరు
వాదనలు వేరు
చేతనలు వేరు
సాధనలు వేరు
మూర్ఖత్వం మెదడులో
తెరలు తెరలుగా
గుండెల్లో
పొరలు పొరలుగా
ఒకచోట ఘనీభవించి
ఒకచోట ద్రవీభవించి-
తెరతీస్తే మరో తెర
పొరతొలిస్తే మరో పొర
పగలేస్తే పగలని లోహం
పారిస్తే పారని ద్రవం-
భక్తి మూర్ఖత్వం
మత మూర్ఖత్వం
జ్ఞాన మూర్ఖత్వం
దృష్టి మూర్ఖత్వం
తన దేవుడే త్రిలోకాధిపతి
తన మతమే సర్వోన్నతం
ఒక మూర్ఖత్వం
దేశాన్ని యుద్ధంలో దించింది
ఒక మూర్ఖత్వం
దేశ ఆర్థిక స్థితిని ఛిద్రం చేసింది
ఒక మూర్ఖత్వం
మూఢ నమ్మకాల్ని నాటి పెంచింది!
వినాయక రాతి విగ్రహం
పాలు తాగింది
మూర్ఖమన్న హేతువాదంపై
మూర్ఖుల భక్తివాదం
దండయాత్ర జరిపింది!
మతాల సారం
మానవత్వమన్న వాదనపై
ఏకత్వంలో భిన్నత్వాలు ఏకమైనా
మతాల సారం వేరువేరే
అంటుంది మత మూర్ఖత్వం!
కరక్కాయ దగ్గుకు
కంఠ సలిపికి
మందుల్ని మించిన వైద్యం
వేపమండ మంత్రం
నినదిస్తుంది మూర్ఖత్వం!
మూర్ఖత్వం చూస్తూ ఉంది
అన్నిటికి ఒకే చూపు
మూర్ఖత్వం చెప్తూ వుంది
అన్నిటికి ఒకే మాట!

- అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946