సాహితి

విశాల ప్రపంచం.. వికసిత అమలిన శృంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆడదానికి పుట్టుకతోనే ఆర్థిక పారమార్థిక స్వాతంత్య్రం వారసత్వంగా ఏర్పరచని మన ధర్మశాస్త్రంమీద అచంచల విశ్వాసం వున్న కథానాయకుడు. తనను గురించి తాను చక్కగా చెప్పకుంటాడు. ‘‘దురుసువాణ్ణి కాదు. ఒక మనిషి సంగతి సిసలుగా తెలుసుకునేందుకు, నేనంటే గిట్టనివాళ్లను అడిగి తెలుసుకోవాలి’’- శ్రీ మల్లాది రామకృష్ణశాస్ర్తీగారు రాసిన అనేక కథానికలలో ‘విపులాచపృధ్వీ’ అనేది విశిష్టమయిన వాటిలో ఒకటి. సాధారణంగా ఆయన రచనలను గురించి మాట్లాడుకునేటప్పుడు ‘మునిగోరింట’, ‘మంత్రపుష్పం’ లాంటివి చెబుతారు. అయితే కాస్తో కూస్తో శృంగారం పాలు చక్కగా రంగరించి చెప్పిన కథ ‘విపులాచపృధ్వీ’ అనేది.
కథలో ఆయనతో ఒక పేదరాలు పడుచుగొంతుతో సంభాషణ సాగిస్తుంది. ‘ఆ చిన్నది మా అమ్మకన్నా ఎన్నో రెట్లు అందంగా వుంది. మా చిన్న చెల్లెలు కంటే ఎంతో అబ్బనకారంగా వుంది’ అని పరిచయ ప్రారంభం చేస్తారు. తన భాగ్యవంతుడి కళలన్నీ ఆమె తల్లి కడుపులో వున్నపుడే గ్రహించిందంటారు. ఆయన ముందు ఆ అమ్మాయి భయపడుతూ ముళ్లమీద కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన అంటారు- ‘బంగారం లాంటి ఒళ్ళు- రతనాల వంటి పళ్ళు- నీలాలు ద్రిమ్మరించే కళ్లు- ఇంత సంపద నీవు ఒక్కర్తెవూ ఏం చేసుకుంటావమ్మా! నీకే పేదరికమైతే - ఇక మా అందరిమాట ఏమిటి?’ ఆ అమ్మాయి నిదానంగానే ‘బాబూ! కులానికి పేదలం కాని...’ అని అర్ధవాక్యం చెబుతుంది. ఆమెను వెళ్లిపోనివ్వకుండా కూర్చుండబెట్టుకుని ఓ కథ చెబుతాడు నాయకుడు. అది రాజుగారి కథ. రాజుగారి సభాస్థలికి ఓ పేదపిల్ల వచ్చింది. ‘మొలచుట్టూ చాలిన కోక లేదు. రొమ్ము జుట్టుతో కప్పుకుంది. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఒళ్లంతా బట్టబయలవుతూంది’. సభాసదులంతా ఈ దృశ్యం చూడలేక బయటకు వెళ్లిపోతారు. రాజు ఒక్కడే మిగులుతాడు ఆ పేద పిల్ల ముందు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ‘కూర్చున్న చోటనుంచి క్రిందికి దిగివచ్చి, ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడు’.
ఈ కథ విన్న కథానాయకుడి ముందు పిరికిగా కూర్చుని వున్న పేద పిల్ల ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడుగుతుంది. అపుడు ఆమె ముఖకవళికను ఇలా చెబుతారు శ్రీ శాస్ర్తీగారు. ‘ఆ చిన్నదాని మెడ వెనక్కు విరుచుకుంది. గొంతు బయల నరాలు కదను తొక్కుతున్నాయి. కణతను పునుకున్న లేత నరం తీగె కశుక్ మంటోంది. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న- మనమరాలు ‘తాతయ్యా నిప్పు కరుస్తుందా?’ అని అడిగినదానికి ప్రతీకగా వుంది.
కథానాయకుడు సమాధానం చెబుతాడు. ‘ఓ.. తప్పకుండా.. ఇంతకన్నా నాకు కావలసినదేముందీ?’
‘సప్త సముద్రాలలోను ఆదికాలం నుంచీ మనకు అందకుండా పేరుకుపోయిన ముత్యాలన్నీ.. ఆ కళ్లు పంతంగా కురిపిస్తున్నాయి..’ అంటూనే రచయిత ‘ఈ దృశ్యం నాకు చూడముచ్చటగానే వుంది.. కాని ఇక నాకు నవ్వు ఆగడంలేదు..’ అంటారు. ఇక్కడ వున్నది నిజమయిన కథామలుపు. ‘గుమ్మంలో నిలుచుని.. మా తాత తండ్రుల ఆస్తిపాస్తులన్నింటికీ జ్యేష్ఠ వారసుడు.. ఇవతల అడుగు వేయడానికి సందేహిస్తున్నట్లు.. కళ్లకెదురుగుండా ఉన్న అద్దం, .... చేస్తుంది..’ కథానాయకుడు తీర్పు ఇచ్చేస్తాడు. ‘ఇక నీకు తప్పదు అమ్మాయ్, నీవు ఏమనుకున్నా సరే. పెళ్లి చేసుకు తీరాలసిందే..’ అని. ఆ అమ్మాయి ‘బంగారు బొమ్మయి అలాగే నిలువబడి పోయింది’- ఇక్కడ రచయిత పాత ప్రబంధాలలోని సామ్యాలు చదువరినే చదివి తెలుసుకోమంటారు.
కథానాయకుడు పెద్ద కేక వేసి తన కుమార్తెలు ఇద్దరినీ రప్పిస్తాడు. ‘లోపలికి వెళ్లి, పెళ్లికూతుర్ని చేసి తీసుకురండమ్మా’ అని ఆదేశం ఇస్తాడు. ఆ పిల్లలు అవును - కాదు అనకుండా విధేయంగా ఆయన ఆజ్ఞ పాటిస్తారు. ‘‘వాళ్ళు బుద్ధిమంతనపు పిల్లలు అనుకోకండి. వొట్టి అల్లరి రాలుగాయలు సుమండీ’ అని చదువరికి హెచ్చరిక యిస్తారు కథాంతంలో. ‘నా దుర్మార్గం మీద వాళ్లకు అంత నమ్మకం. అందుచేతే ఏం చెప్పినా చిటికెలో చేస్తారు’.
శాస్ర్తీగారి కథలలో శృంగార కథలు అనేకం. అయితే అవన్నీ అమలినం. తరువాత తరాలవారికి ఆదర్శప్రాయం అయిన ధోరణిలో నడుస్తాయి తప్ప, తుచ్ఛులు అనుకునే శారీరక సంబంధాన్ని ప్రతిపాదించవు. సాహిత్యంలో లోతుపాతులు ఎత్తిచూపుతూ, కథాగమనాన్ని చమత్కారంగా నడిపించే నేర్పు వీరికి వెన్నతో పెట్టిన విద్య. తెలుగు కథకు ఆధునికత జోడించి సర్వాంగ సుందరం చేసిన కీర్తి వీరిది.

- శ్రీవిరించి, 09444963584