సాహితి

ప్రపంచాన్ని శుభ్రం చేస్తారట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా దేహాలైనా
మా జీవితాలైనా అపరిశుభ్ర కారణం
మీ మనసుల మురికే గదా...
మేం అగాధాలలో పడిపోటానికి కారణం
మీరు అకస్మాత్తుగా
ఉన్నత శిఖరాలకు చేరటమే గదా...

మీ మనస్సులలో డ్రైనేజీ పారుతూ...
దుష్ట క్రిమి కీటకాలు నిరంతరం పెరుగుతూ...

మా దేహాల స్వేద పరిమళం
మీరే గదా గతుకుతున్నారు
మీ దేహాల బద్ధకం కంపు
మాకే గదా అతుకుతున్నారు

మీ చీకటి బట్టల్ని
వెలుతురుగా మార్చటం వల్లనే గదా
మా బతుకు బట్టలు మురికిపట్టాయ
మీరు నీటిని గాలిని
బలాత్కరించటం వల్లనే గదా
మాకిన్ని రోగాలు పెరిగాయ...

మా వాటాల్ని మీరు కొల్లగొట్టి
మమ్మల్ని దొంగలుగా మార్చారు
మా పాటల్ని మీరు ఎత్తుకుపోయ
మమ్మల్నింకా అడవుల్లోనే నిలిపారు
మా బతుకు గొంతుల మీద కత్తులు పెట్టి
మా చేతులలో తుపాకులు పెట్టారు

మాకు నవ్వొస్తోంది...
దేశాన్ని మురికి చేస్తూ మీరు
ప్రపంచాన్ని శుభ్రపరుస్తామంటుంటే!!

- రావి రంగారావు, 9247581825