సాహితి

హైకూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వెళ్లావా అందమా
నయాగరా
నిలిచిపోయింది

తేలుతూ వస్తున్న చీకటే
తోడు
నది ఏకాంతానికి

బరువెక్కింది
పెయింటింగ్
ఎన్ని చూపులు వాలాయో

సాయం సంధ్యని
నది తీసుకుపోయిందేమో
చీకటి

ప్రవహిస్తున్న
వర్ణచిత్రాలు
నది కాన్వాసుపైన

- గోపరాజు రాధాకృష్ణ