సాహితి

విశ్వనరుడు - జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె. కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి
కట్టువడని విశ్వకవివి నీవు
తరతరాల కుళ్లు కడిగివేయుటకెత్తి
పట్టినావు కలము గట్టిగాను

ఆ.వె. నీ కులమ్ము జూచి నినే్నడిపించిన
వారికంటె - ముందు వరుస లోన
నిలిచి - ప్రతిభ జూపి - నిఖిలాంధ్ర దేశమ్ము
గర్వపడగ కలము గడిపినావు

ఆ.వె. కింది కులము వల్ల - పొందిన అవమాన
భారమంత నింపి - పద్యకావ్య
ములకు ప్రాణములను - పోసినాడవు - సాహి
తీ ప్రపంచమునకు దివిటీ నీవు

ఆ.వె. కిందివాని గొంతు - కిందివాని బతుకు
కవిత చేయరాని కాలమందు
అణగదొక్కబడిన ఆ విశ్వనరుని జీ
వితము - దించితివి కవిత్వమందు

నీవు లేకపోతె - ఈ విశాల కవిత్వ
లోకమునకు వెలుగు లేకపోవు
నీదు దారి మాకు నిత్యమ్ము స్మరణీయ
మయ్య - జాషువా! మహానుభావ!!

- తోకల రాజేశం, 9676761415