సాహితి

గురజాడ చూపు పట్టుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాడ తన కవిత్వం ఉద్దేశం చెపుతూ ‘అందరికీ అర్థమయ్యేదే కవిత్వం’ అన్నారు. కానీ గురజాడ తరవాత వచ్చిన భావ కవులలో కొందరు ఎవ్వరికీ అర్థం కాని భావగీతాలు పాడారు. ఆ తరువాత వచ్చిన వచన కవులు కొంతకాలం కొంతైనా అర్థమయ్యేట్టు రాశారు. తరువాత భావ చిత్రాలనీ శైలినీ సంవిధానం అనీ, అభివ్యక్తి అనీ ఇప్పుడు గురజాడకి దూరంగా జరిగి కొంతమందికే అర్థమయ్యేటట్టు రాస్తున్నారు. లబ్ధ ప్రతిష్ఠుల్ని అందిపుచ్చుకుంటున్న ఇప్పటితరం కూడా ఇదే దోవలో ఉన్నారు. బాగానే ఉన్నట్టున్నా జనసామాన్యానికి అందుతాయా అంటే అనుమానమే. కారణం సామాన్యుడి వాడుకకి దగ్గరగా కంటే విద్యాధికుల రచనా భాషగా స్థిరపడిపోతున్న భాషే ఒకటి కవిత్వంలో కనిపిస్తోంది. గురజాడ, గిడుగుల వారసులం అని చెప్పుకోవాలంటే కవులన్నవాళ్లు తమ భాషని అందరికీ అర్థమయ్యేలా మార్చుకోవాలి. అందరికీ అర్థమయ్యే భాషలో కవిత్వం చెపితే తమది కవిత్వం కాకుండా పోతుందని ఈనాటి కవులకి భయం ఉన్నట్టుంది. పాపం గురజాడే ఆ భాషతో అకవి అయ్యాడు కదా! ఇక మాండలికం కవిత్వానికి పూర్తిగా పనికొస్తుందని గట్టిగా నమ్మడానికి ఇప్పటి కవులు సిద్ధంగా ఉన్నారని నేననుకోవడం లేదు. కనీసం వచన రచనల్లోనైనా మాండలికాన్ని పూర్తిస్థాయిలో వాడిన వాళ్ళు గురజాడ వారసులుగా రా.వి.శాస్ర్తీ, పతంజలి వంటి వాళ్ళు అచ్చుపద్దుల పుణ్యమా అని నామిని తెలిదేవర భానుమూర్తి వంటి వాళ్ళు కొందరు తయారయ్యారు. గేయం విషయానికొస్తే వంగపండు లాంటి వాళ్ళింకా కొడవలికి కక్కులు కొడుతూనే ఉన్నారు. సినిమా పాటల భాష పరమ సంకరంగా ఉంది. గురజాడ కోరుకున్న వాడుక భాష ఈనాటి కవిత్వంలో వచన రచనల్లో ఉందని గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలమా?
భాష సంగతి సరే, భావాల విషయంలో గురజాడ వారసులం అని చెప్పుకోవాలంటే కవులూ రచయితలూ హేతువాదులు కావాలి. ఆచరణలో సంగతి విడిచిపెట్టినా రచనల్లో హేతువాదం ఎంతవరకు కనిపిస్తోందో కవులూ, రచయితలూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. ఎంత తక్కువ రాసినా గురజాడ దాదాపు తన రచనలన్నిటిలో హేతువాదాన్ని ఇమడ్చగలిగారు. ఆనాటి కంటె ఇప్పుడు మనోభావాల విషయంలో జాగ్రత్త పడితే హేతువాదం ప్రజల మెదళ్ళలోకి ఎక్కించడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రశ్నించడం నేర్పడం ముందు మొదలెట్టాలి. కోకొల్లలుగా దొరుకుతున్న మూఢనమ్మకాల సంగతులికి సంగతులు వెయ్యడంలో కూడా కవులు, రచయితలు దూరంగా ఉంటున్నారు. కులాన్ని మతాన్ని వదులుకోమని చెప్పడానికి వీల్లేకుండా చేయిదాటిపోయింది. కనీస మానవత్వాన్నైనా మేల్కొల్పడానికి కవులు, రచయితలు ఎంతమంది ముందుకొస్తున్నారు? సమాజం పైపొరల్ని కొంతమందికే అర్థమయ్యే భాషలో అద్భుత కవిత్వం రాస్తే ఏం లాభం?
సొంత లాభం కొంత మానుకుని పొరుగుపాడికి తోడ్పడేలా సమాజం నుంచి భారీ మొత్తాలు తాము సంపాదించుకున్నవాళ్ళ మనసుల్లో నాటేలా కవులు, రచయితలు మూకుమ్మడిగా ప్రయత్నిస్తే నేటి కవిత్వం సమాజం గురించి అని గుర్తించి యువతరం దగ్గరకొస్తారు. అప్పుడు గురజాడ చూపుని అందుకున్నట్టు అవుతుంది.

- కాండూరి లక్ష్మీపతి