సాహితి

విశ్వాసాల పట్ల అంధత్వం - విజ్ఞాన సముపార్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాది నమ్మకం మూఢత్వం కాదు.. మా ఇంట్లో వాతావరణం వల్ల నాకు కొన్ని అలవాట్లు వచ్చాయి. కానీ వాటికి అర్థం తెలియకుండా నేను ఆచరించే రకాన్ని కాదు. గాలిలో మంచి చెడూ వైబ్రేషన్స్ రెండూ వుంటాయి. కేవలం మంచిని వైబ్రేట్ చేయగల ఏంటెనా లాంటి వస్తువులను ఆచారంగా చేశారు మనవాళ్లు. మన చుట్టూ వాతావరణం అంతా ఏటమ్స్‌తోను, సబ్ ఎటామిక్ పార్టికల్స్‌తోను నిండి వున్నాయి. అవునని సౌండ్ దానిని వైబ్రేట్ చేస్తుంది. మంత్రం, తంత్రం, స్తోత్రం వాటి కోసరమే ఏర్పడ్డాయి..’ అంటుంది స్నేహ అనే అమ్మాయి శ్రీమతి జలంధర రాసిన కథలో. కథ పేరు కూడా ‘స్నేహ’యే. ఈ వాక్యాలు చదివినప్పుడు కన్యాశుల్కంలో గిరీశం పంతులు ‘్థయోసఫిస్టులు చెప్పినట్లు మనవాళ్ళ ఆచారాలన్నీ దూరం ఆలోచించి ఏర్పాటుచేసినవే’ అన్న నాటకం పంక్తులు గుర్తుకువస్తాయి. పూర్వ ఆచారాలు, పడికట్లు క్రమక్రమంగా సైన్స్ (ఆధునిక విజ్ఞానం) కూడా అథింటికేట్ చేయడం మనం ఇప్పటి తరాలలో చూస్తూనే వున్నాం.
ఇంతకూ ‘స్నేహ’ అనే అమ్మాయి పల్లెటూరు పిల్ల కాదు. ఎం.ఏ ఈస్థెటిక్స్ చదువుతూన్న పిల్ల. అన్నిటినీ తరచి, తరచి చూడడం- విరిచి విరిచి ఆలోచించడం నేర్చుకున్న పరిశీలనాత్మకురాలు. కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తూ కొత్త కంప్యూటర్‌కు పూజలు పునస్కారాలు చేయడం, ఆఫీసు ముందు ముగ్గులు వేయకుండా జనాభాను లోపలకు రానివ్వకపోవడం లాంటి పనులు చేస్తూ వుంటుంది. కంపెనీ యజమానికి ఇవన్నీ గిట్టవు. ఆమెను తిరస్కరిస్తూ మాట్లాడుతాడు. ఆమె కథనం అంతా సుందరరావు అనే మరో వ్యక్తి గమనిస్తూ తన అంచనాలతో చదువరుల ముందు వుంచుతాడు.
స్నేహ చెప్పే తతిమ్మా మాటలు కూడా ఆలోచనలకు దారితీసేవే. ‘మనం నమ్మనట్లు నటిస్తూ వాటిని మానమండీ. మీ ఫ్రెండ్ హేమంత్ రోజూ కుంకుమబొట్టు పెట్టుకోనిది బైటకు రాడు. మా పెదనాన్న ఆదివారాలు గుమ్మడికాయ ‘దిష్టి’ తీయందే వూరుకోడు. అరిటాకులు, మామిడితోరణాలు, హోమాలు, పూజలు నవగ్రహదానాలు.. ఏది ఎవరు మానారండీ!’ అంటుంది.
ఆమె కళ్లు ‘ఎంత నిర్మలంగా వున్నాయి’ అనుకుంటాడు సుందర్రావు. సెంటిమెంట్స్ ఏమాత్రం లేని మనిషి కూడా ఆమెలో స్నేహితురాలిగా చూడడం ఆమె సంస్కారంవల్లనే కుదిరింది గానీ, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని నమ్ముతాడు. పెళ్లిని గురించి, ఆలుమగల సంబంధాలను గురించి కూడా ఆ అమ్మాయికి వేరయిన అభిప్రాయాలున్నాయి. ‘మా పెదనాన్న ఎవరో స్నేహితురాలిని వెదుక్కున్నాడు. అది బ్లాక్‌మెయిలింగ్ పాయింటుగా మా అమ్మ ఆయనను సాధించి డైమండ్ నెక్లెస్‌కు అప్లికేషన్ పెడుతుంది. దీని పేరు పెళ్లా? ఎంత నైచ్యం’ అని గంభీరంగా చెప్పగలుగుతుంది.
ఇలాంటి అమ్మాయిని- తాగుడుమైకంలో- హేమంత్ (కంప్యూటర్ కంపెనీ యజమాని) అనుభవిస్తాడు. ఇటువంటి సందర్భాలలో మనవాడిని ఆ పిల్లను వివాహం చేసుకోమని బలవంతం చేయడం సామాజికంగా జరిగే పని. కాని వాళ్లిద్దరి కులాలు వేరు. హేమంత్‌కు ఇరవై లక్షల కట్నంతో మేనకోడలు సిద్ధంగా వుంది కూడాను! సుందరరావుకు రుూ సంబంధాన్ని ఎట్లా సెటిల్ చేయాలో ఒక మానసిక సమస్యగా తయారవుతుంది. కాని స్నేహ అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ‘నా ఆలోచనలే అతడిని ఆహ్వానించాయి. అతనంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, ఆరాధన... అతని తొందరపాటుకన్నా నేను అతనిని కాదనలేకపోయానేమో! ... పారిజాతాలు కోస్తూ నేను మానసికంగా అతని పాదాలకు పూజ చేసే పిచ్చిదాన్ని. నా అలంకరణ, నాలోని తియ్యటి ఆలోచనలు అన్నీ నాలో దాచుకున్నవి అతనికి చెప్పేదాన్ని. అతనిలో అతనికి తెలియని కొన్ని గొప్ప గుణాలున్నాయి. స్నేహశీలి, మేధావి, గొప్పగా మాట్లాడగలడు, కార్యవధీ, సౌమ్యుడు. అవసరం వస్తే తప్ప కనీసం ఎవరితోనూ కరుగ్గా మాట్లాడడు. అటువంటి వ్యక్తి నా వాడుగా ఆరాధించాను. అందుకని అతను నా దృష్టిలో తప్పు చేయలేదు. అది అంతే’ అని స్పష్టంగా చెప్పగలుగుతుంది. అంతేకాదు, ఇంకా దూరంగా ఆలోచించి అంటుంది. ‘ఇదేదో బ్లాక్‌మెయిలింగ్ పాయింట్‌గా అతణ్ణి పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించడం నైచ్యం.. అతను నాకు లేకపోయినా అతడి జ్ఞాపకాలతో బ్రతకగలను నేను.. బాధను మానసికంగా రెడీ అయిపోతాను. టెన్షన్, బాధ తప్పవు. మరి ఇది నా జీవన్మరణ ప్రశ్న. దీని కోసరం నిలబడతాను నేను’ అని నిర్ణయంగా చెప్పగలుగుతుంది.
జీవితాన్ని పొరలు విప్పి చూపించడమే కాదు, పురులు విప్పి నాట్యం చేయిస్తుంది ఈ కథానిక. నేల, నీరుకు మటుకే పరిమితం అయిన కథలను గాలికి (కదలిక), వెలుతురుకు (వివేకానికి), తేజస్సుకు (పరిపూర్ణమే) తీసుకువచ్చే కథా కథనశీలత ‘జలంధర’కు అలవోకగా సాధ్యమయిన నిపుణత.

- శ్రీవిరించి, 09444963584