సాహితి

పరిశుద్ధ రుధిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగం చీకటి భూమిపై రాలిపడి
మిగిలిన సగం జలపాతంలా
గగనం నుండి
దూకుతున్న సమయాన
విశ్వాన్ని గర్భంలో
దాచుకున్న ఆ తల్లి
కోటానుకోట్ల సూర్యకిరణాలను
పండువెనె్నలను ముద్దలుగా కలిపి
మాయపు ప్రపంచంలోకి
రక్తపు మరకలతో ఒక కాంతిని తోసింది
ఆ కాంతి యొక్క రక్తపు మరకలు
మా దేహాలకు
రేగికంపలా అతుక్కున్న పాపాన్ని కడిగి
పరిశుద్ధ ఆత్మలుగా మార్చేసింది
నేడు మేమంతా ఆ పరమాత్మ బాటలో
క్రిస్మస్ తరువులమై
స్నేహ పవనాలు వెదజల్లుతాము

- అఖిలాశ, 072595 11956