సాహితి

హిమ ధూమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ కిరణాల గిలిగింతలకు,
కితకితలకు,
కించిత్తు బద్ధకంగా ఒళ్లు విరుచుకొనే
నిర్లిప్తతకు నిలువుటద్దం,
ఆనందానికి అవరోధం,
పొంగివచ్చే దుఃఖం పేరుకుపోయినట్లు
ప్రయాణ పురోగమనానికి ప్రమాద హేతువు
శతృశిబిర నిఘా నేత్రానికి అడ్డుతెరలా
సువిశాల శే్వత కుడ్యం
సుదూర శే్వతనగం
ప్రేమికుల పెన్నిధి
వృద్ధ, వ్యాధిగ్రస్తుల నిషేధం
పరిమితి లేని పారిశ్రామికీకరణ ప్రభావం
కురిసిందంటే కొందరికి మోదం
మరికొందరికి ఖేదం
ఈ మాసపు హిమధూమం.
*
- వేదం సూర్యప్రకాశం