సాహితి

నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తూ పోతున్నాయి
వత్సరాలెన్నో
వడి వడిగా విచ్చేస్తూ
వలపును పంచుతూ

నిత్యనూతనంగా
నిండు యవ్వనంతో
నిటారుగా నిలబడుతూ
నిజాల్ని గమనిస్తూ

సహజత్వాన్ని ఆహ్వానిస్తూ
సక్రమ మార్గాల్ని ఆశిస్తూ
సకల జనుల క్షేమం కోసం
సద్వినియోగ ఆశల కోసం

ప్రజల్లో మెదలుతూ
పర్యావరణ సంరక్షణకై చూస్తూ
ప్రగతిని సూచిస్తూనే
ప్రాచీనతను కాపాడాలంటూ..
*
- సుతారపు వెంకట నారాయణ
9848958690