సాహితి

కొత్త క్యాలెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త క్యాలెండర్ వచ్చిందని
రోజూ వచ్చే ఉదయం మారదు
విచ్చుకునే పుష్పం ఆగదు
కొత్త సంవత్సరం వచ్చిందని
రోజూ సాయంత్రం సూర్యుడికి చీకటి మసిపూయక మానదు
వెలుతురు బంగారం దోచుకోవడం ఆపదు

క్యాలెండరు మారుతున్నదని
క్యాలెండరు గడుల గుండెలలో దాగి
భయపెడుతున్న తిథి వార నక్షత్ర గ్రహాలు మారవు
కొత్త సంవత్సరం పనికొచ్చేది
నరాల నూపేసే నదుల మీద పడి మత్తుగా జుర్రుకోటానికి
నోరు లేని జంతువుల మీద పడి కమ్మగా నమిలేయటానికి
బరువు బాధ్యతలు మోస్తున్న రహదారులమీద పడి
వాటి పరువు తీయటానికి

పుట్టినరోజు వచ్చిందన్నా
కొత్త క్యాలెండరు పండగ తెచ్చిందన్నా
బతుకు చెట్టుకు ఒక ఆకు రాలిపోవటం
పుడుతూ వెంట తెచ్చుకున్న
అగ్గిపెట్టెలోని ఒక అగ్గిపుల్ల కాలిపోవటం

క్యాలెండర్ మారిందని
బతుకులు మారవు, కాకపోతే
బతుకు రంగును ఓసారి చూసుకోవచ్చు
ఏవేవో కొత్త రంగులు మన తృప్తి కోసం పూసుకోవచ్చు

కొత్త సంవత్సరం అంటే
పాత క్యాలెండరును చీకటిలోకి తోసెయ్యటం
కొత్త క్యాలెండరును నిట్టనిలువునా దేవుడిలా నిలబెట్టటం
కొత్త క్యాలెండర్ అంటే
కొత్త స్మార్ట్ఫోను, కొత్త మోడల్ కారు..
ఇంకా ఎనె్నన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు
బాగున్నా సరే పాత మోడళ్ళు తీసి పారేస్తున్నారు
ఎలా ఉన్నా సరే కొత్త మోడళ్ళు తెచ్చుకుంటున్నారు

క్యాలెండర్ మారిందని
పూసే పూలు ఆగవు, పూసినవి రాలకా మానవు
పండే కాయలు ఆగవు, పండినవి పడిపోకా మానవు
కాకపోతే మొక్క బాగుండాలని శుభాకాంక్షలు చెబుదాం
అప్పుడే కొత్త క్యాలెండరుకు విలువ
మొక్కను బతకనిద్దామని సంకల్పం చెప్పుకుందాం
అప్పుడే సంతోషిస్తాడు క్యాలెండర్లు సృజించే నలువ...

జీవనం పరుగులో అలిసిన మనిషికి
క్షణకాలం ఆగినపుడు మంచినీళ్లు అందించే దారి సత్రం
ఈ కొత్త సంవత్సరం
మళ్ళా మనిషి పరుగు పెట్టాల్సిందే
చేరాల్సిన చివరి మైలురాయి చేరి పడిపోయేదాకా సాగాల్సిందే

నీ ప్రయాణంలో నీ చీకటి ముక్కలు కింద పడితే
అవి రేపు ముళ్ళ చెట్లయి జాతి గమనాన్ని చంపేస్తాయి
నీ ప్రయాణంలో చెమట కిరణాలు వదిలిపెడితే
అవి రేపు నేలమీద మొలిచి నలుగురినీ బతికిస్తాయి

- రావి రంగారావు, 9247581825