సాహితి

వెలుగు జిలుగుల తెలుగు పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగ... పండగ...
తెలుగిళ్ళ లోగిళ్ళు తళతళ మెరిసే పండగ
పెద్దలు నచ్చే పండగ, పిన్నలు మెచ్చే పండగ
పెద్దల్ని కొలిచే పండగ, సుద్దుల్ని పంచే పండగ
భూమాత ఈస్ట్‌మన్ కలర్లో తళుకులీనే పండగ
గోమాత పొదువు ముంతడు పాలతో పొంగిపొర్లే పండగ
ఇబ్బడిముబ్బడిగా పంట కళ్ళాల రాశులు నిండే పండగ
పిల్లా, పెద్దా, గొడ్డు, గోదా - నవ్వగలిగే పండగ
తుళ్ళి తుళ్ళి ఎగరగలిగే పండగ
భగభగమంటూ, భుగ భుగ ఎగిసే...
భోగీ మంటల పండగ
ఆకలి పేగుకి అమృతమిచ్చే...
‘కక్కముక్కల’ కనుము పండగ
పశువుల పండగ, శిశువుల పండగ
అల్లుళ్ళ అలకల పండగ.. మరదళ్ళ సొగసుల పండగ
పైసలు లేని మావల గుండెల గుండె గుభేళ్ళ పండగ
గొబ్బెమ్మల పండగ, డూడూ బసవన్నల పండగ
హరిదాసు తత్త్వాలు తారాడే పండగ
రంగవల్లులు ముంగిట్ల తారాడే పండగ
రయ్‌మని ఎగిరే కోడిపుంజుల పండగ
మీసాలు మెలేసే, పందెం రాయుళ్ళ...
‘పొగరు’బోత్తనాల పండగ
బుడబుక్కల బూచోళ్ళ, గజిబిజి వేషాల పండగ
అందాల పండగ, ఆనందాల పండగ
సంతసాల పండగ, సంరంభాల పండగ
పిల్లా, పెద్దా, రాజూ, పేదా... అందర ఒకటయ్యే పండగ
భోగి, కనుమలు తోడుగ రాగ...
ముక్కనుమ కూడ వేడుక కాగా...
గాదెలు, బోదెలు, గేదెలు...
నిండుగ, మెండుగ, దండిగ నిండే
ఉత్సాహాల, ఉల్లాసాల, సల్లాపాల పండగ
దశదిశల, నలుదెసల
కాంతిని నింపే, క్రాంతిని నిలిపే...
తెలుగుల పండగ, వెలుగుల పండగ
తెలుగు వెలుగుల జిలుగుల పండగ
సమ్యక్ క్రాంతి పండగ...
సంక్రాంతి పండగ!

- రమాప్రసాద్ ఆదిభట్ల, 9348006669