సాహితి

అసలైన సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతీ... మకర సంక్రాంతి
బక్కచిక్కినవారి బాధలన్నీ తీరి
బతుకు బాగుపడితే నవ్వుల సంక్రాంతి
కిలోల కొద్ది వీపు మోతలేని చదువు దొరికితే
బడిపిల్లలకు భలే సంక్రాంతి
పండించిన రైతన్నకు
సరియైన రొక్కమిస్తె దరహాస సంక్రాంతి
తిండి దొరకని వృద్ధులకు
వేళకు అన్నపానాదులందితె మురిపాల సంక్రాంతి
కొలువులున్నోళ్లు కునుకు తీయకుండ
కార్యాలు చేస్తుంటె భవ్య సంక్రాంతి
నీడ లేని దారి బతుకులన్నిటికి
గూడు దొరికితె కమనీయ సంక్రాంతి
అన్నదమ్ముల వోలె అందరు కలిసుంటె
అన్నివేళలా అదే అసలైన సంక్రాంతి

- బొమ్మిదేని రాజేశ్వరి, 9160908045