సాహితి

ధన ధాన్య రాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవిరిసి పరిమళిస్తూ పూచే
పెరటి తోటన చక్కన్ని ముద్దబంతి
కమ్మనైన హరిదాసు నృత్యగానం
హరికీర్తనల గూడె చిరుతల తంత్రి
డూడూ బసవన్నల అందెల సడితో
వెల్లి విరిసిన ఆనంద హేల దొంతి
అందాల రంగుల రంగవల్లులతో
మురిపిస్తున్న నవయవ్వన యంతి
అంగరక్షణి వలె పచ్చని పైరులతో
సుందరమైన పల్లె మాగాణీ ప్రకృతి
అందివచ్చిన కొత్త పంటలతో
ఇంటింటా బంధువర్గ సహబంతి
అలుపెరుగని రైతన్నల మోములో
కలిగించును అంతులేని ప్రశాంతి
అలిగిన అల్లుళ్ళ చెంతన చేరిన
పుట్టినింటి ఇంతుల చామంతి
ఆనంద భరిత సంబరాలలో వీధుల్లో
భోగిమంటల చెంత వెచ్చని కాంతి
అందరి జీవితాలలో వెలుగొందాలి
సుఖశాంతుల తోరణాల స్రవంతి
మళ్ళీ మళ్ళీ రావాలి మీ జీవితాన
ధన ధాన్య రాసి మకర సంక్రాంతి

- డా. శారదారెడ్డి వకుల