సాహితి

జీవన సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు పూవై పరిమళించినంత కాలమే
నీ చుట్టూ ఈ తుమ్మెదల ఝుంకారం

నీవు తెమ్మెరలా మదిని స్పృశించినంత కాలమే
నీ కోసం తన రంగవల్లుల ప్రతీహారం

నీవు మొయలువయ భువిన కురిసిపోతేనే
నీ వయపుకు తలలెత్తే మొలకల పులకరింపు

నీవు స్వాతి జల్లువయతేనే ముత్యపు చిప్పలందు
నీకయ నిత్యమూ ఎదురుచూపుల కైమోడ్పులు

నీవు శీతాకాలపు తుషారమై కురిసినపుడే
తాను నీ ఎదను రాలిన పారిజాత పరిమళం
నీ వురకలెత్తే రుధిరమయతేనే నీ కదలికకు
తన నరనరాన ఆవేశపు జలదరింపు

నీవు ధనుర్మాసపు మరువమయతేనే
కుసుమించే శీతల గంధమయ్యేది

నీవు మయూరమయ నర్తించితేనే
ప్రతి క్షణమూ జీవితానికొక మధుక్రాంతి

నీవూ - తానూ, పుడమీ-పైరుగా పంటలెత్తితే
నిత్య జీవితము కాగలదు పుష్య సంక్రాంతి

ఉత్తరాయణమైనా, దక్షిణాయనమైనా
దాంపత్యమంటే... కలిసి కూర్చే కలల బొమ్మలకొలువు

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి, 9493571405