సాహితి

కాంతి వెదజల్లు సంక్రాంతి కదలివచ్చె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగనల్ తమ గృహ ప్రాంగణంబుల తీర్చు
రంగవల్లికల హొరంగులందు
విభవంబులొల్క గొబ్బెమ్మలందున కుల్కు
బంతి-చేమంతి పుష్పంబులందు
తెలవార మేలుకొల్పులతోడ కడు కమ్మ
గా పాడు హరిదాసు గళమునందు
స్వయముగా చెమటోడ్చి పండించు ధాన్యమ్ము
గంపకెత్తెడు రైతు కన్నులందు
గంగిరెద్దుల గంతుల పొంగులందు
తేజు మెఱయంచు కోడి పందెమ్ములందు
చెలువు మీఱెడి బొమ్మల కొలువునందు
స్వచ్ఛ్భారత సూర్యుని జాడలందు
కాంతి వెదజల్లు సంక్రాంతి కదలివచ్చె

- డా. రామడుగు వెంకటేశ్వర శర్మ 9866944287