సాహితి

లోటస్ టెంపుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలసిన మనశ్శరీరాల ఆశ్రయతీరం కాబోలు
ఈ దేవాలయం
నగర సముద్ర ప్రళయఘోష అంటని
ఒంటరి ద్వీపం కాబోలు ఈ దేవాలయం
దీని రూపం కమలం ధవళం
కమలగర్భంలో అచిర పరిచిత
ప్రశాంత మకరందమూర్తి పరమాద్భుత దర్శనం-
ఇక్కడి నిశ్శబ్దంతో సంగమించి
సమస్త అలజడులు, ఆందోళనలు ఆలోచనలు
అస్తిత్వం కోల్పోతాయి-
మనిషి, విప్పారి పద్మవౌతాడు
నిశ్శబ్దమీద తేలి కూర్చుంటాడు
ఒక ధ్యానస్థితి, అలౌకిక ఆనంద సమాధి స్థితి,
గుణాతీత స్థితి-
లోపలి సకల సముద్రాలు స్తంభించినట్టు
సమస్త నాగరిక అనాగరికతలు స్తంభించినట్టు
అంతటా నిశ్శబ్దమొక్కటే మిగిలి వున్నట్టు, నిలిచి వున్నట్టు
ఇదే, ఇదే సత్యమైతే శాశ్వతమైతే బాగుండుననిపించేట్టు-

ఇదో అపూర్వసమ్మోద ప్రపంచం
విశాల వినిర్మల శుద్ధిసరోవరం
నిలిచి వున్నంత సమయం
విశ్రమించినంత సమయం
మనిషొక మీనం- మనిషొక మీనం

- మంత్రి కృష్ణమోహన్, 9441028186