సాహితి

ఉత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రహ్మరథం’.. సోపాన మార్గం కావాలి

‘తెలుగు భాషకు బ్రహ్మరథం’ వ్యాసంలో అనేక విధములైన అద్భుతాలు మెరిపించి మురిపించారు. మృతిచెందిన సన్యాసులను తీసికొనిపోయెడు వాహనానికి బ్రహ్మరథమనెడి విషయం మరియు దాని అర్థం తెలియని వారు కోకొల్లలు. తెలుగు భాషతో వ్రాయుచున్న వ్యాసాలు, కథలు, కవితలు, వ్యాఖ్యానాల మధ్య ఆంగ్ల పదాలను ఇరికించి సన్నాయ నొక్కులతో భాషను బానిస మార్గాన నడిపించే వారికి శాస్ర్తిగారి వ్యాసం చెంపపెట్టు కాగలదు. అక్షరం పక్కన ఉండాల్సిన సున్నా(ం)ని, తదుపరి లైనులో మొదటి అక్షరంగా వ్రాసి భాషను మధ్యలో నరికేవారున్నారు. ‘బ్రహ్మరథం’ వ్యాసం చాలామందికి సోపాన మార్గం కాగలదని ఆశిస్తున్నాను.

- తన్నీరు సీతారామాంజనేయులు
జగ్గయ్యపేట

ప్రాథమిక విద్యపై శ్రద్ధ లేదు

11-4-16వ తేదీ సాహితిలో ప్రచురితమైన ‘తెలుగు భాషకు బ్రహ్మరథం’ వ్యాసం ఆలోచింపజేసే విధంగా ఉంది. భాష దోష భూయష్టం అవడానికి కారణం ప్రాథమిక విద్యపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడమే. తప్పులు ఒప్పులుగా చలామణీ అవడం దారుణం. తెలుగు భాషాభివృద్ధికి కంకణం కట్టుకున్నవారు ఈ విషయంలో ఏం చేస్తున్నారు?

- వేదుల సత్యనారాయణ