సాహితి

ప్రాణాలు పలుచబడ్డాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పతాక శీర్షికల్లో
రక్త కపోతమై రాలినవాడు

సింహాసనం కింద
సింహమై గర్జించినవాడు

నేడు
నాలుగు పంక్తులకే
పరిమితమై పోయాడు

కొమ్మకొమ్మకూ వేలాడుతున్న
వాడి మృత్యు చిత్రం
కలాలకూ గళాలకూ
దిష్టిబొమ్మలా కనపడుతున్నదేమో

పాడిపంటై పరిమళించిన వాడు
ఎద్దై ఏడ్చినవాడు
నేడు అనాథ కళేబరమై
కుళ్ళిపోతున్నాడు

వాడి పక్షం నిలువని వాడు
ప్రతిపక్ష మార్జాలమై
క్షీరసాగరాన్ని జుర్రేస్తున్నాడు

ఈ మందలో గర్భం దాల్చిన మేషాలు
మరో అంగట్లో అమ్మ(కం)లు
అయపోతున్నాయ

అద్భుతాలు సృష్టించే విధాత
చావులు ఆగవంటున్నాడు
చావులు ఎక్కువైతే
ప్రాణాల విలువ పలుచనైనట్టుగా ఉంది

మరణాన్ని ఆపలేని మహానుభావులను
చరిత్ర రాకాసి బల్లై మింగేస్తుంది

- పర్కపెల్లి యాదగిరి, 9299909516