సాహితి

అతడొక మండే కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆతడి వాడి వేడి వ్రేళ్లు నిప్పులతో ఆటలాడతాయ
ఎగసిపడే మంటల్ని పొదివి పట్టుకుంటాయ
ఆతడి మరిగిన రక్తం కరిగిన లోహద్రవంతో
పోటీపడి ఉరకలెత్తుతుంది

ఆతడి మండే కళ్ళు నిప్పుల్ని రాల్చుతాయ
నీటి తొట్టిలో ముంచి తీసే ఆతడి చేతివేళ్లు
సముద్రాల్ని ఎగరేస్తుంటాయ
ఎగిరే ముక్కుపుటాలు సునామీలతో పోటీపడుతుంటాయ
అతని ఒళ్ళంతా పొగలే... సెగలే
అణువణువునా అపర కాళికా కరాళ నృత్యమే
అవును.. కొలిమిలా కాలుతూ
కొలిమిని రగిలించే శ్రామికుడు
ఆతని తలలోంచే సూర్యోదయం
తలలోంచే సూర్యాస్తమయం
సూర్యుడెపుడూ ఆతడిపై తాండవిస్తూనే ఉంటాడు

ఆతడు ఇనుమును కరిగిస్తాడు
ఉక్కును పోతపోస్తాడు
ఆతని ఉక్కు కండరాల దెబ్బకి
ఉక్కు సైతం బిక్కపోతుంది
ఆతడు దిమ్మెమీద దెబ్బతీస్తూనే ఉంటాడు
తన కసినంతా ఇనుము మీద చూపిస్తుంటాడు
కణకణలాడే నిప్పులకీ అతని కళ్ళకీ
తేడా కనిపించదు
కాలే కొలిమికీ, కాలే శరీరానికీ
తేడా అగుపించదు
అవును. వాడు నిప్పును జయంచాడు
ఉక్కును జయంచాడు
కానీ, మనిషినే జయంచలేకున్నాడు.

- గన్ను కృష్ణమూర్తి, 9247227087