సాహితి

మనమంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమంతే..
భూమిని ఇచ్చేసి
భుక్తిని అడుక్కుంటాం.
చెట్టుని కొట్టేసి
నీడని కొనుక్కుంటాం.
చెరువుని అమ్మేసి
నీటిని వెదుక్కుంటాం.
మనమంతే..
తలని తాకట్టుపెట్టి
ముఖాన్ని వడ్డీకి తిప్పుతాం
దరిద్రాన్ని నెత్తికెత్తుకుని
తలరాతని తిట్టుకుంటాం.
వౌనంగా ఉన్నవాడిని
మాట్లాడమంటాం
మాటలాడే వాడితో
పోట్లాటలకి దిగుతాం.
కులం కంపుకొట్టే గుంపులో
గుర్తింపు కోసం
గుండెని బాదుకుంటాం.
మతాన్నీ గతాన్ని
గంటకోసారి గుర్తుతెచ్చుకుని
నెత్తుటి మడుగులో ఆడుకుంటాం.
వీధి గూండాల వెనుక
జెండాలు పట్టుకుని
ఊరేగే వాడిని వీరుడనుకొంటాం.
పగతో రగిలిపోతూ..
ప్రతీకారం తీర్చుకునే ఆరాటానికి
పోరాటం పేరు పెడతాం.
మనమంతే..

- గరిమెళ్ళ నాగేశ్వరరావు, 9491804709