జాతీయ వార్తలు

సెంట్రల్ జైలులో లొంగిపోయిన సాయిబాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, డిసెంబర్ 26: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా శుక్రవారం రాత్రి ఇక్కడి సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు జైలు వర్గాలు శనివారం తెలిపాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగంపై ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాయిబాబాను పోలీసులు గతంలో అరెస్టు చేయడంతో ఆ వర్శిటీ అతనిని ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టులతో క్రియాశీల సంబంధాలు ఉన్నాయనే కేసులో విచారణ ఖైదీగా ఉన్న సాయిబాబాకు అనారోగ్య కారణాల రీత్యా గతంలో బొంబాయి హైకోర్టు మూడు నెలల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం సాయిబాబా పెట్టుకున్న పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం ఈ నెల 23న కొట్టివేయడంతో పాటు 48 గంటలలోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ గడువులోగా లొంగిపోని పక్షంలో అతన్ని అరెస్టు చేయాల్సిందిగా న్యాయమూర్తి అరుణ్ చౌదరి పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా శుక్రవారం రాత్రి తనంత తానుగా జైలు అధికారుల వద్ద లొంగిపోయారు.
** పోలీసులకు లొంగిపోయేందుకు శుక్రవారం రాత్రి నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు చేరుకున్న ప్రొఫెసర్ సాయబాబా **