కడప

పురావస్తు శాఖ సైంధవపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 6: ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డుపనులకు కేంద్ర పురావస్తు శాఖ సైంధవ పాత్ర పోషించడంతో ఆ పనులు అర్థాంతరంగా నిలిచాయి. మరో 40 రోజులలో ఆంధ్ర భద్రాదిలో కోదండ రాముని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సుమారు రూ. 10 కోట్లతో టిటిడి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఆలయం చుట్టూ రోడ్డుపనులు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. కొంతభాగం జరిగిన ఈ పనులను పురావస్తు శాఖ నియమ, నిబంధనల పేరిట అడ్డుకుంది. దీంతో టిటిడి అధికారులు చేసేది ఏమి లేక రోడ్డుపనులను ప్రక్కన పెట్టి మిగిలిన పనులను చేపట్టారు.్ఫలితంగా పురావస్తు శాఖ పనితీరు పట్ల భక్తులు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి పురావస్తు శాఖ అడ్డుకట్టగా ఉందని ఇఓ సాంబశివారావు పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం అభివృద్ధి పనులకు పురావస్తు శాఖ సహకరించాలని కోరిన విషయం విదితమే. కాని ఆ శాఖ మాత్రం అభివృద్ధి నిరోధకంగా మారుతూ మా పని ఇంతే అన్న చందంగా మారింది. ఒక ప్రక్క బ్రహ్మోత్సవ గడియలు దగ్గర పడుతుండడంతో టిటిడి చేసేది ఏమి లేక అయోమయంలో ఉంది. ఉత్తర భాగంలోని గృహాలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు వేయాలని టిటిడి భావిస్తుంది. పురావస్తు శాఖ తమకు ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవాలని టిటిడిపై అంక్షలు పెడుతుంది. 15 రోజుల క్రితం ప్రారంభమైన రోడ్డుపనులు అర్ధాంతరంగా నిలిచాయి. ఇప్పటికైనా అభివృద్ధికి పురావస్తు శాఖ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
పులివెందుల, మార్చి 6: పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం వెంకటేశపురానికి చెందిన శాకం భీమశివారెడ్డి (35) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... శివారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడని అతని సోదరుడు శాకం శివనాగేశ్వర్‌రెడ్డి గత రెండేళ్ల నుంచి కరువు రావడంతో అప్పులు ఎక్కువై ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. విషయం తెలియగానే తాము శివారెడ్డిని తీసుకొని పులివెందులలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. కానీ ఇక్కడ వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించారని, కొద్దిసేపు చూసి బాగానే వుందనిచెప్పి వెళ్లిపోయారని, ఆ తర్వాత చూస్తే తన అన్న మృతిచెంది వున్నాడని, ఈ విషయంపై వైద్యుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెబుతున్నాడని ఆరోపించారు. ఇలా అయితే ఎంతోమంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య అంజనమ్మ, కుమారుడు, కుమార్తె వున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అంజనమ్మ కోరుతోంది.

రైలు కింద పడి మహిళకు తీవ్రగాయాలు
రైల్వేకోడూరు, మార్చి 6:స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆదివారం చిట్వేల్ మండలం రాచపల్లెకు చెందిన గుండమ్మ రైలు క్రింద జారి పడి తీవ్రగాయాలకు గురైంది. మహాశివరాత్రి సందర్భంగా పొలతల శైవక్షేత్రానికి ఆమె వెళుతూ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతి రూయాకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కమలాపురం, మార్చి 6: కడప-తాడిపత్రి హైవేరోడ్డుపై కమలాపురం సమీపంలోని గొల్లపల్లె వంతెన వద్ద ఆదివారం రాత్రి 8.30గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందాడు. ఆ బాలుని తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే యర్రగుంట్ల మండలం నిడుజివ్వికి చెందిన చాంద్‌బాష తన కుమారుడు ఇర్షాన్ (5) కలసి మోటర్ సైకిల్ పై తన అత్తారిల్లు అయిన కమలాపురం మండలం జీవంపేటకు రాత్రి సమయంలో వస్తుండగా కడప నుంచి యర్రగుంట్ల వైపునకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కమలాపురం 108వాహనం ద్వారా కడప రిమ్స్‌కు తరలిస్తుండగా బాలుడు ఇర్ఫాన్ మృతి చెందాడు.

తండ్రీకొడుకుల మృతిపై అనుమానాలు
కడప, మార్చి 6: కడప నగరంలోని దేవునికడప కోనేటిలో తండ్రీ కొడుకులు గాలికృష్ణమూర్తి, లక్ష్మణ్‌ల మృతిపై పలు సందేహాలు నెలకొన్నాయి. తండ్రీ కొడుకులు ఇద్దరు ఈతరాక చనిపోయారా, హత్యచేసి అందులో వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండురోజులుగా కన్పించకపోయినా కుటుంబ సభ్యులనుంచి ఫిర్యాదులు రాకపోవడంతో కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యచేసుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే చిన్నచౌకు పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో అన్ని తేలుతాయని చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. నిజానిజాలను నిగ్గుతేల్చాలని స్థానికులు కోరుతున్నారు.