రాష్ట్రీయం

రేషన్ డీలర్లకు జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్సిడీలు భారమైనా భరిస్తాం * పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి
రాజమండ్రి, డిసెంబర్ 31: ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న రేషన్‌డీలర్లకు జీతాలు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వెల్లడించారు. డీలర్ల రేషన్‌కార్డుల సంఖ్యలో హెచ్చుతగ్గులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని జీతాలు చెల్లించే అంశాన్ని నిర్ణయిస్తామన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లాలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే అంతకు ముందు విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం వల్ల 96శాతం నిత్యావసరాలు ప్రజలకు పంపిణీ అవుతున్నాయన్నారు. ఈపాస్ విధానం వల్ల ఏటా రూ.1000కోట్ల విలువైన నిత్యావసరాలు ఆదా అవుతున్నాయన్నారు. ఈ విధానం వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచి ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు పొందిందన్నారు. సబ్సిడీ పథకాలు భారమైన భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 14లక్షల కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14.90లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, జన్మభూమి గ్రామసభల్లో కొత్తగా లక్ష 37వేల కార్డులను పంపిణీ చేస్తామన్నారు. మొత్తం లక్ష 93వేల దరఖాస్తుదారులను రేషన్‌కార్డులకు అర్హులుగా గుర్తించామని, మిగిలిన 60వేల మందికి జనవరి నెలలో జారీ చేస్తామన్నారు. ఎఫ్‌సిఐ ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల భారమైనా పౌరసరఫరాల శాఖ ఆ బాధ్యతను స్వీకరించిందన్నారు. ఈ సీజన్‌లో 5.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 3.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేయించి, బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. సేకరించిన ధాన్యానికి గాను రైతులకు కనీస మద్దతు ధరతో రూ.600కోట్ల చెల్లించామన్నారు. ప్రభుత్వం నిధులు, స్థలాన్ని కేటాయిస్తే రాజమండ్రిలో పౌరసరఫరాల శాఖ గోదామును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ అంశంపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో చర్చించామన్నారు. ప్రయోగాత్మకంగా సబ్సిడీ ధరలతో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని, అవి విజయవంతమైతే రాష్టవ్య్రాప్తంగా వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో 2.20లక్షల కొత్త గ్యాస్‌కనెక్షన్లు జారీ చేస్తామని వెల్లడించారు. జిల్లా రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మిల్లింగ్ చార్జీలను పెంచాలని, ధాన్యం సేకరణకు రూ. 50లక్షల బ్యాంకు గ్యారంటీని కోటి వరకు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, డిఎస్‌ఓ జి ఉమామహేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు లింగారెడ్డి రాజమండ్రిలోని గిడ్డంగుల సంస్థను, మండల సప్లై పాయింట్‌ను తనిఖీ చేశారు.