జాతీయ వార్తలు

‘రేప్’ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అత్యాచారం గురించి మహిళలను కించపరచేలా మాట్లాడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన వ్యాఖ్యలకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుకు ఆయన తన లాయర్ ద్వారా సమాధానం పంపారని, ఎక్కడా క్షమాపణ ప్రస్తావన లేదని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం బుధవారం తెలిపారు. ‘సల్మాన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొని అలిసిపోయిన తాను- ‘రేప్‌కు గురైన మహిళ’లా ఫీలయినట్టు ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.