క్రీడాభూమి

మెగా టోర్నీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంట్రాక్టు వివాదానికి తెరపడిందన్న వెస్టిండీస్ కెప్టెన్ సమీ

కోల్‌కతా, మార్చి 12: కాంట్రాక్ట్ వివాదానికి తెరపడిందని, దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదని వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ డారెన్ సమీ అన్నాడు. టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ కోసం శనివారం సహచరులతో కలిసి నెట్స్ ప్రాక్టీస్ చేసిన అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అదంతా గతమని, ఇప్పుడు తమ దృష్టి టి-20 వరల్డ్ కప్‌పైనే కేంద్రీకృతమైందని అన్నాడు. కాంట్రాక్టులోని అంశాలపై ఆటగాళ్లు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) మధ్య చాలాకాలంగా నానుతున్న వివాదానికి ఇటీవలే తెరపడిన విషయం తెలిసిందే. దీనితో సమీసహా పది మంది సీనియర్ క్రికెటర్లు, క్రిస్ గేల్, సులేమాన్ బెన్, జాసన్ హోల్డర్, ఆండ్రె ఫ్లెచర్, డ్వెయిన్ బ్రేవో, సామ్యూల్ బద్రీ, లెండల్ సిమన్స్, జెరోమ్ టేలర్, ఆండ్రె రసెల్, మార్లొన్ సామ్యూల్స్, దనెష్ రాందీన్ కాంట్రాక్టుపై సంతకాలు చేశారు. కాంట్రాక్టు వివాదం ముగియడంతో, టి-20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు విండీస్ పూర్తిస్థాయ జట్టు భారత్ చేరుకుంది. ఈ అంశాలను సమీ ప్రస్తావిస్తూ విండీస్ బోర్డు, ఆటగాళ్ల మధ్య తలెత్తిన సమస్య కేవలం అంతర్గతమైనదని, దీనితో ఎవరికీ సంబంధం లేదనీ అన్నాడు. టి-20 వరల్డ్ కప్ పోటీలకు హాజరుకావడం లేదని బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవో చేసిన ప్రకటనపై స్పందించేందుకు అతను నిరాకరించాడు. ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్, ‘స్పిన్ మాంత్రికుడు’ సునీల్ నారైన్ ఇప్పటికే టి-20 వరల్డ్ కప్ నుంచి వైదొలగ్గా, ఆ జాబితాలో డారెన్ బ్రేవో కూడా చేరాడు. ఈ ముగ్గురూ టి-20 వరల్డ్ కప్‌లో ఆడడం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 28 ఏళ్ల పోలార్డ్ గాయంతో బాధపడుతున్నాడని, టి-20 వరల్డ్ కప్‌లోగా అతను కోలుకునే అవకాశాలు లేవని తెలిపింది. అదే విధంగా బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు తలెత్తడంతో అతను ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ప్రాక్టీస్ చేస్తున్నాడని పేర్కొంది. ఇంకా ఒక స్పష్టతకు రాకపోవడంతో తనను వరల్డ్ కప్ టోర్నీ నుంచి మినహాయించాలని నారైన్ కోరినట్టు విండీస్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో వివరించింది. డారెన్ బ్రేవో ఎందుకు వరల్డ్ కప్‌లో పాల్గొనడం లేదనే విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అతనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల టి-20 వరల్డ్ కప్ పోటీల్లో తాను ఆడడం లేదన్నాడు. ఈ మెగా టోర్నీకి తనను ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అయితే, అనివార్య కారణాల వల్ల తాను అందుబాటులో ఉండడం లేదని తెలిపాడు. బ్రేవో చేసిన ప్రకటన గురించి విలేఖరులు ప్రశ్నించగా అది బోర్డుకు సంబంధించిన అంశమని సమీ అన్నాడు. తాము క్రికెట్ ఆడేందుకు వచ్చామని, ఇతర విషయాలపై చర్చించడానికి కాదని వ్యాఖ్యానించాడు. పోటీలో ఉన్న ప్రతి ఒక్క జట్టూ విజయం కోసం పోరాడుతుందని, ఈ నేపథ్యంలో పోరు తీవ్ర స్థాయలో సాగుతుందని సమీ అభిప్రాయపడ్డాడు. మైదానంలోకి దిగిన తర్వాడ డబ్బు, కాంట్రాక్టు వంటి అంశాలను పట్టించుకోకుండా, ఆటపైనే దృష్టి కేంద్రీకరించాలని అతను యువ క్రికెటర్లకు హితవు పలికాడు. విండీస్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నాడు. విజ యమే లక్ష్యంగా పోరాడతామని తెలిపాడు.