సంపాదకీయం

అమ్ముడుపోతున్నాము..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ప్రపంచీకరణ యుగం. ‘బంక బంక’గా, ‘జిగట జిగట’గా విచిత్రమైన ‘కంపు’ను వెదజల్లే విదేశీయ సంస్థల పొడుగాటి చాక్లెట్లను ఎడమ చేతులతో నోటిలోకి కుక్కుకుంటున్న భారతీయుల యుగం.. ఆ చాక్లెట్లు, ‘బంక’ను నోటికి, ముక్కుకు పులుముకొని గొప్పగా ప్రదర్శించడం ‘జీవన విలాసం’- లైఫ్ స్టయిల్-గా మారిన భారతీయుల యుగం! ఆ చాక్లెట్లు తిని మత్తెక్కి ‘డాన్సులు’ చేస్తున్న అత్తాకోడళ్ల యుగం, ‘గంతులు’ వేస్తున్న మామా అల్లుళ్ల యుగం!! ఇలాంటి వారు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వంటి సహజ చరిత్రను మరచిపోయారు. కృత్రిమ ‘ప్రపంచీకరణ యుగాన్ని’ గురించి ‘డప్పులు’కొట్టి ప్రచారం చేస్తున్నారు. ఇలా ‘ప్రపంచీకరణ’ మత్తెక్కి తైతక్కలాడుతున్న వారికి మన దేశం మరోసారి స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి రంగం సిద్ధవౌతోందన్న ధ్యాస లేదు, స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాలన్న తపన లేదు. విదేశీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో భయంకర దురాక్రమణను సాగిస్తున్నాయి. భారతీయ సంస్థలను విదేశీయ సంస్థల వారు కొనేస్తున్నారు. కానీ ఈ ‘దురాక్రమణ’ దురాక్రమణగా ప్రచారం కావడం లేదు. సంకుచితమైన ‘సరిహద్దు’లను చెఱపివేసి అంతర్జాతీయ వాణిజ్య సామ్రాజ్యాన్ని, పుడమిపల్లెను నిర్మించడంలో ఇదంతా భాగమన్న ‘భ్రాంతి’కి మేధావులు గురవుతున్నారు, ప్రభుత్వాల నిర్వాహకులు గురవుతున్నారు, ప్రచారకర్తలు ఉత్సాహంగా ఈ ‘భ్రాంతి’ని వాస్తవంగా చిత్రీకరిస్తున్నారు. కానీ అసలు వాస్తవం- కొంచెం కొంచెంగా మన దేశం విదేశీయ సంస్థలకు అమ్ముడుపోతోంది. గతంలో మన దేశంలోకి చొరబడిన విదేశీయ వాణిజ్య సంస్థలు దేశాన్ని ‘కొంచెం కొంచెం’గా కాజేశాయి. చివరికి మొత్తం దేశాన్ని దురాక్రమించాయి! పరాజయ చరిత్ర పునరావృత్తికి ఇది మరో వికృత నిదర్శనం. విజయ చరిత్ర పునరావృత్తి దేశ సార్వభౌమ స్వభావానికి,ప్రజల స్వాతంత్య్ర ప్రవృత్తికి దర్పణం! పరాజయ చరిత్ర పునరావృత్తికావడం దాస్యప్రవృత్తికి అద్దం. ఒక దేశపువిజయం మరో దేశపు పరాజయంగా మారిన చరిత్ర అంతర్జాతీయ సమాజాన్ని శతాబ్దులపాటు కల్లోలగ్రస్తం చేసింది, ఈ చరిత్ర వివిధ కాలాలలో పునరావృత్తమైంది. ‘వాల్‌మార్ట్’ అనే అమెరికాకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థ మన దేశానికి చెందిన ‘్ఫ్లప్‌కార్ట్’ అన్న మరో మహాసంస్థను దిగమింగివేయడం ఇలాంటి పునరావృత్తికి మరో నిదర్శనం. క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుంచి మన దేశాన్ని ఐరోపా ప్రభుత్వ, ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు దిగమింగాయి. స్వాతంత్య్ర భారతం బానిసగా మారింది. ఇప్పుడు విదేశీయ సంస్థలు మళ్లీ వందల వేల సంఖ్యల్లో చొరబడుతున్నాయి!
ఈ చొరబాటువల్ల మన స్వాతంత్య్రం మనగలదా? లేక మళ్లీ మనకు స్వాతంత్య్రం పోతుందా?? అన్నది ఈ దేశ సమష్టి హితాన్ని కోరుతున్న వారికి ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న! ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య వ్యవస్థలలో ఒకటి. ‘్ఫ్లప్‌కార్ట్’ సమాచార సాంకేతిక రంగంలో, పంపిణీ రంగంలో, అంతర్జాల అనుసంధాన రంగంలో అద్భుత విజయాలను సాధించిన అతి పెద్ద భారతీయ సంస్థ! ఈ సంస్థ ‘విలువ’ దాదాపు కోటి ముప్పయి ఆరున్నర లక్షల కోట్ల రూపాయలని ప్రచారమైంది. సచిన్ బన్సల్, వినయ్ బన్సల్ అన్న ఇద్దరు ‘సమాచార సాంకేతిక స్థపతులు’- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు- పదకొండేళ్ల క్రితం ‘్ఫ్లప్‌కార్ట్’ సంస్థను ప్రారంభించారు. పాతికేళ్ల యువకులిద్దరు ప్రారంభించిన సంస్థ ఇలా పదకొండేళ్లలో ఇంత పెద్ద వ్యవస్థగా ఎదగడం భారతీయుల విజయం. ఇప్పుడు ఈ సంస్థకు చెందిన డెబ్బయి ఏడు శాతం వాటాలను అమెరికా ‘వ్యాపార రాక్షసి’ వాల్‌మార్ట్ కొనివేయడం భారతీయుల పరాజయం! ఇదీ చారిత్రక పునరావృత్తి. గతంలో ఫ్రాన్సు, బ్రిటన్ మన దేశంలోకి చొరబడ్డాయి, పోర్చుగీసులు, డచ్చి ‘నీచులు’ కూడ చొరబడ్డారు. ఈ దేశాల వాణిజ్య సంస్థలు మన దేశంపై ఆధిపత్యం కోసం కొట్టుకు చచ్చాయి. చివరికి దేశమంతా ఈ ఐరోపా మారీచుల వశమైంది. ఇప్పుడు వాల్‌మార్ట్, అమెజాన్, మొన్‌సాంటో, పాస్‌కో ‘పోస్సేస్కో’ వంటి విదేశీయ సంస్థలు మన ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం కోసం ‘తడిగుడ్డలతో గొంతులు కోసుకుంటున్నాయి, మన సంస్థల గొంతులను కోస్తున్నాయి’. ఇందుకు తాజా ఉదాహరణ ‘్ఫ్లప్‌కార్ట్’ అమ్ముడుపోవడం. చరిత్ర పునరావృత్తం కావడం లేదని భ్రాంతిపడుతున్న వారు అమాయకులు. ‘్ధ్యస’ లేనివారు లేదా ఆత్మవంచకులు, జన వంచకులు. ఈ పరాజయ పునరావృత్తిని ఎవరు ఆపగలరు? దురాక్రమణ నిరోధకులెవరు??
‘ప్రపంచీకరణ’ పేరుతో మానవీయ సంస్కార రహితమైన ఆర్థిక జీవులుగా అధికాధిక ప్రజలు మారిపోతున్నారు. అందువల్ల ‘వాల్‌మార్ట్’ వంటి సంస్థలు భారతీయ సంస్థలను దిగమింగడం కేవలం వాణిజ్య మహా పరిణామంగా ప్రచారం అవుతోంది. కానీ భారతీయ వౌలిక అస్తిత్వం ఇలాంటి వాణిజ్య దుశ్చర్యల వల్ల గ్రహణగ్రస్తం అవుతోంది, ఆర్థిక స్వార్థానికి అతీతమైన మానవీయ మైత్రి భంగపడుతోంది. వౌలిక అస్తిత్వం జాతీయత, మానవీయ మైత్రి సంస్కృతి, సంస్కారాల సమాహారం! గతంలో ఐరోపా ‘సంస్థలు’ వాణిజ్యంలోకి చొరబడినాయి, ఆ తరువాత ఐరోపా ప్రభుత్వాలు మన సామాజిక, సాంస్కృతిక రంగాలలోకి చొరబడినాయి. ఫలితంగా మన విద్యలు, మన న్యాయ వ్యయస్థ, వ్యవసాయం, వాణిజ్యం- ఒకటేమిటి? సర్వ భారతీయ సంస్కారాలు పాశ్చాత్య భావగ్రస్తమయ్యాయి. భారతీయులు ‘నితాంత అపార భూతదయ’కు దూరమై ఈర్ష్య, అసూయ, క్రౌర్యం, హంతక ప్రవృత్తిని ఐరోపావారి నుంచి నేర్చుకున్నారు. ఈనాడు దేశంలోని విద్యావంతులు విబుధదైత్యులుగా మారి దోచుకుంటున్నారు. అవినీతిని, అనైతికతను, బౌద్ధిక మానసిక లైంగిక భౌతిక బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. ఇదంతా ‘పాశ్చాత్య భావ విస్తరణ ప్రభావం’. ఈ దుష్టప్రభావ విముక్తికి జరుగవలసిన కృషి ఆరంభం కాకముందే ‘ప్రపంచీకరణ’ అలముకొంది. ‘పాశ్చాత్య విస్తరణ’కు భయంకర పునరావృత్తి ప్రపంచీకరణ..
‘స్వదేశీయులను పాశ్చాత్యులు రకరకాలుగా విభజించారు. క్రీస్తుశకం 1814లో ‘బ్రిటన్ దొంగలు’ పుదుచ్చేరిని ఫ్రాన్స్ దొంగలకు అమ్మేశారు. ఇందుకు ప్రతిఫలంగా కెనడా దేశంలోని ‘క్యూబెక్’ను ఫ్రాన్సు ప్రభుత్వం బ్రిటన్‌కు అప్పగించింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు. ఈ ‘దొంగల’కు వ్యతిరేకంగా 1857 మే 10న ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం మొదలైంది, 1947 వరకూ సాగింది. తొలి స్వాతంత్య్ర సమరాన్ని గుర్తుచేసుకోవలసిన- మే 10 తేదీకి ముందురోజున ‘్ఫ్లప్‌కార్ట్’, ‘వాల్‌మార్ట్’కు అమ్ముడుపోయినట్టు ధ్రువపడడం విచిత్ర విపరిణామం. ‘్ఫ్లప్‌కార్టు’ను స్థాపించి పెంచి పోషించిన సచిన్ బన్సల్, వినయ్ బన్సల్ అన్నదమ్ములవలె- అన్నదమ్ములు కాకపోయినప్పటికీ- పదకొండేళ్లు స్నేహపథంలో ప్రగతి సాధించారు. ‘వాల్‌మార్ట్’ వాణిజ్య షడ్యంత్రం ఫలితంగా ఈ స్నేహితులు విడిపోయారు, సచిన్ బన్సల్‌ను ‘్ఫ్లప్‌కార్ట్’ నుంచి వెళ్లగొట్టారు.. ఇదీ ‘విభజన సూత్రా’నికి పునరావృత్తి.. పాశ్చాత్య చిత్తవృత్తి!!