సంపాదకీయం

కొరియా వ్యథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్‌తో జూన్ 12వ తేదీన తాను జరుప తలపెట్టిన సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దుచేసుకొనడం ఆశ్చర్యకరం కాదు. ‘ప్రపంచీకరణ’ వల్ల తమ వాణిజ్య ప్రయోజనాలకు జరుగుతున్న విఘాతాన్ని సహించలేని అమెరికా అధ్యక్షుడు కల్లుతాగిన కోతి వలె చిందులు తొక్కుతుండడం ఏడాదికి పైగా నడుస్తున్న అంతర్జాతీయ ప్రదర్శన. ఆసియా పశ్చిమ ప్రాంతంలోని ఇరాన్, తూర్పు ప్రాంతంలోని ఉత్తర కొరియా అణ్వస్త్రాల ఉత్పత్తి కార్యక్రమానికి స్వస్తి చెప్పడం అంతర్జాతీయ సమాజం అభినందిస్తున్న మహా పరిణామం. ఈ నేపథ్యంలో మూడేళ్లక్రితం- బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉండిన సమయంలో- తమ దేశం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణ్వస్త్ర నిరోధక అంగీకారాన్ని ట్రంప్ ఇటీవల రద్దుచేయడం అంతర్జాతీయ సమాజాన్ని హాహాకారాలకు గురిచేసిన విపరిణామం. ఇరాన్‌తో కుదిరిన బహుళ పక్షీయ అంగీకారం నుంచి అమెరికా వైదొలగినప్పటికీ చైనా, రష్యా తదితర దేశాలు ఇరాన్‌తో మైత్రిని పాటించడానికే నిశ్చయించాయి. అందువల్ల ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా విధించ తలపెట్టిన ఆంక్షలు నీరుకారిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో నియంత వలె వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో అల్లాడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న సాకుతో ట్రంప్ నిప్పులను తొక్కేశాడు. గత ఏడాది జనవరిలో గద్దెనెక్కినప్పటి నుంచి ట్రంప్ ప్రవర్తనా ప్రదర్శన విన్యాసాలను తిలకిస్తున్న వారికి- ఆయన కొరియా విధానం ఆశ్చర్యకరం కాదు.. సమస్య ‘కొరియా’ అణ్వస్త్రాలను తయారుచేయడం కాదు. అణ్వస్త్ర నిర్మాణ పాటవం అనేక దేశాలకుంది. చైనాకు, అమెరికాకు మధ్య మొదలైన ప్రచ్ఛన్నయుద్ధం అసలు సమస్య. అందువల్లనే ఉత్తర కొరియా తన అణ్వస్త్ర పాటవ పరీక్షా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన రోజుననే ట్రంప్ తన వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాడు. సింగపూర్‌లో జరుగవలసిన ఈ సమావేశం తాత్కాలికంగా రద్దయిందా? లేక చర్చల ప్రక్రియ మొత్తం మూలపడుతుందా? అన్నది వేచి చూడదగిన అంశం.
ఉరుములు ఉరిమి పిడుగులను వర్షించిన ఆకాశం అకస్మాత్తుగా చల్లబడినట్టు ఏడాది క్రితం వరకు జపాన్‌ను, అమెరికాను పేల్చివేయనున్నట్టు బెదిరించిన ఉత్తర కొరియా అణుపాటవ పరీక్షలను మానివేస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యకరం. చైనా ప్రభుత్వం ఒత్తిడి లేదా సలహాల కారణంగానే ఉత్తర కొరియా అణ్వస్తవ్య్రాప్తి నిరోధానికి అంగీకరించిందనడం ప్రచారం కాని రహస్యం. 1948లో కొరియాను అగ్రరాజ్యాలు విభజించిన తరువాత దక్షిణ కొరియా అమెరికా ప్రాబల్య మండలంగా మారింది. ఉత్తర కొరియా కమ్యూనిస్టు రష్యాకు తోకగా మారింది, ఆ తరువాత కమ్యూనిస్టు చైనాకు మిత్రదేశమైంది. దశాబ్దుల పాటు ఉత్తర కొరియా తిండి గింజల కొరతతో దుర్భర దారిద్య్రగ్రస్తం కావడం చరిత్ర. ఇదే సమయంలో అమెరికా ప్రాబల్య మండలంగా మారిన దక్షిణ కొరియా విపరీతమైన ఆర్థిక వేగాన్ని పుంజుకొంది, అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదిగి సంపన్న దేశమైంది. జపాన్‌కు పొరుగు దేశమైన దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతిపథంలో జపాన్‌తో పోటీపడుతోంది. దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశంలోను, ఇతర దేశాలలోను వాణిజ్య సామ్రాజ్యాలను ఏర్పాటుచేశాయి. చైనా, అమెరికా, ఐరోపా, జపాన్‌లకు చెందిన ఘరానా సంస్థలతో పోటీపడుతున్నాయి. ఇలాంటి ఆర్థిక ప్రగతి ఉత్తర కొరియాకు అంతరిక్షమంత దూరంలో ఉంది. అయినప్పటికీ ‘అణ్వస్తశ్రక్తి’గా ఎదగడానికి ఉత్తర కొరియా దశాబ్దుల పాటు యత్నించడానికి కారణం రెండవ ప్రపంచయుద్ధ వారసత్వం!!
కొరియా ద్వీపకల్పం చైనా ఈశాన్య ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. మూడువైపులా సముద్రం ఉన్న కొరియా ఉత్తరపు సరిహద్దు చైనాతో కలసి ఉంది. ఇరుగుపొరుగున ఉన్న సింకియాంగ్, మంచూరియా, టిబెట్ దేశాలను, మంగోలియాలోని సగాన్ని దిగమింగిన చైనా కొరియాను దిగమింగకపోవడం చారిత్రక అద్భుతం. జపాన్ శతాబ్దుల పాటు కొరియాను, చైనాను ఆక్రమించి హడలెత్తించడం ఈ చారిత్రక అద్భుతానికి కారణం. చైనాకు, కొరియాకు జపాన్ ఉమ్మడి శత్రువైంది. ప్రశాంత మహాసముద్ర ఉత్తర ప్రాంతంలో జపాన్ సముద్రానికి తూర్పున జపాన్, పడమర కొరియా నెలకొని ఉన్నాయి. దురాక్రమణకు చారిత్రక ప్రతిరూపమైన జపాన్ క్రీస్తునకు పూర్వం రెండవ శతాబ్దిలో దురాక్రమించి మూడుముక్కలు చేసింది. ఈ మూడు రాజ్యాలు క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో ఏకీకృతమై చైనానుండి విముక్తమయ్యాయి. 1905లో రష్యావారి ఆక్రమణ నుండి కొరియాను జపాన్ విముక్తం చేయగలిగింది. కొరియా ‘జపాన్ సంరక్షిత ప్రాంతం’గా 1945 వరకు కొనసాగింది. ఈ దశాబ్దుల కాలవ్యవధిలో జపాన్ చైనాను ఆక్రమించుకోవడం సమాంతర పరిణామం. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, రష్యాల నాయకత్వంలోని ‘మిత్రరాజ్యాలు’- అల్లీడ్ నేషన్స్- గెలిచాయి. జపాన్, జర్మనీల సారథ్యంలోని ‘అక్షరాజ్యాలు’ - యాక్సిస్ ఫోర్సెస్- ఓడాయి. ఫలితంగా జపాన్ నుండి విముక్తమైన కొరియాను అమెరికా, రష్యాలు పంచుకొన్నాయి. దొంగలు ఊళ్లుపంచుకొనడం పాశ్చాత్యులు నేర్చిన పాఠం, పాశ్చాత్యుల వారసత్వం. ముప్పయి ఎనిమిదవ ఉత్తరపు అక్షాంశరేఖ ఉభయ కొరియాల మధ్య సరిహద్దుగా మారింది. ఉత్తర కొరియాను రష్యా, చైనాలు, దక్షిణ ప్రాంతాన్ని పాశ్చాత్యులు నియంత్రిస్తుండడం ఉభయ కొరియాల ప్రజల ఉమ్మడి వ్యథ. 1950 నుండి 1953 వరకు ఉభయ కొరియాల మధ్య నడచిన భయంకర యుద్ధానికి లక్షల మంది ప్రజలు బలైపోయారు. ‘విభజన’ కారణంగా భార్యాభర్తలు తల్లీబిడ్డలు అక్కాచెల్లెళ్లు అన్నాతమ్ముళ్లు రేఖకు అటూ ఇటూ చెల్లాచెదురయ్యారు. 2000వ సంవత్సరంలో విడిపోయిన కుటుంబాలవారు, నలబయి ఏడేళ్ల తరువాత కలుసుకున్నప్పుడు ఈ విషాద స్మృతులు విస్తృతంగా ప్రచారమయ్యాయి. కానీ మళ్లీవారికి ఎడబాటు తప్పలేదు.
కొరియా ప్రజల అసలు కథ ఇది, దశాబ్దుల జీవన వ్యథ ఇది. ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే జాతికి చెందిన ప్రజలను రాజకీయ వాణిజ్య ప్రాబల్య సిద్ధాంతవాదులు విడదీశారు. అణ్వస్త్రాలు అనేక దేశాలవద్ద ఉన్నా యి. కొరియాలో లేకపోయినంత మాత్రాన తేడా ఏమిటి? ఉభయ కొరియా ల ప్రజల ‘గోడు’ అసలు సమస్య. ఐక్య కొరియా అవతరించడం ప్రధానం.