సంపాదకీయం

విధ్వంసం నుండి విధ్వంసం లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షిణ సముద్రం వద్ద చైనా ఆయుధాలతో మోహరించింది. జపాన్‌ను ధ్వంసం చేయాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్‌ఒసి) వద్ద నిరంతరం కాల్పులు జరుపుతోంది, జిహాదీ ఉగ్రవాద శిబిరాలను పోషిస్తోంది. ఇజ్రాయిల్ గాజాలో పాలస్తీనా పౌరులను హతమార్చింది. అమెరికా సిరియాపై మారణాయుధాలు ప్రయోగించింది. ఇక ఇండియా సంగతేమిటి? ఇక్కడ రాజకీయ నాయకులు తమ దేశపు ఆస్తులను తామే తగలబెట్టుకుంటారు. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ ప్రజలు ఆందోళన చేపట్టగా, పోలీసు కాల్పులకు దారితీసి 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకేం.. రాజకీయ నాయకులకు చేతినిండా పనిపడింది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని స్టాలిన్, కమల్ హాసన్ వంటివారు ఆందోళన మొదలుపెట్టారు.
తమిళనాడులో తాజాగా జరిగిన విధ్వంసం చూడండి. తూత్తుకుడి అనేచోట కాపర్ మెల్టింగ్ ప్లాంట్ ఉంది. దీనికి పర్యావరణ అనుమతి (ఎన్‌విరాన్‌మెంట్ క్లియరెన్స్)లేదు. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగజేస్తుంది. అందుకని దీనిని మూసివేయవలసిందిగా కాంగ్రెస్- సిపిఎం కార్యకర్తలు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. 22-5-2018 నాడు అల్లరిమూకలు విధ్వంసానికి దిగటంతో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ఆందోళనకారులు మరణించారు. ఇక్కడ గమనింపవలసిన ఒక ప్రధానాంశం ఉంది. ఈ ప్లాంట్ స్థాపనకు 9-8-2007న అనుమతి లభించింది. ఫైలు నెంబరు- ఏ-తేదీ 9-8-2007 అనుమతిని ఇచ్చింది సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. సీపీఎం నేత ప్రకాశ్‌కారత్ ఇందుకు మద్దతు పలికాడు. యుపిఏ-2 ప్రభుత్వం ప్రకాశ్‌కారత్ మద్దతుతో అధికారంలో ఉంది. పన్నీరు సెల్వం 2018లో అధికారంలో ఉండగా అతనిని గద్దెదింపటం కోసం కాంగ్రెసు, సిపియంలు కలిసి ఆందోళనలు జరిపించి పోలీసు కాల్పులకు దారితీసే పరిస్థితులు సృష్టించారు. వీటిని దుర్మార్గపు రాజకీయాలు అంటారు. 2019లో రాహుల్‌గాంధీ భారత ప్రధాని కావాలనే ఆకాంక్షతో దేశానికి నిప్పుపెట్టడానికి సిద్ధమైనాడు. ఇదే తూత్తుకుడి కథ. ఆమధ్య ఏపీలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని ఆందోళన మొదలైంది. తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును తగులబెట్టారు. బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఇతర పార్టీలకు చెందిన 14 మందిని అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్యచేశారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా?
బ్రిటన్‌లోని ప్రజలు దేశభక్తులు. అక్కడ పూర్వం తిగ్గులూ, టోరీలు పరస్పరం కలహించుకున్నారు. ఇప్పుడు లిబరల్స్, కన్సర్వేటివ్‌లు పోట్లాడుకుంటారు. అమెరికాలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు పడదు. కాని దేశభక్తితో వీరు పార్టీ విభేదాలు మరచి ఏకమవుతారు. మరి మన దేశంలో పరిస్థితి ఇందుకు విభిన్నం. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడానికి అంతా ఏకమవుదామంటూ న్యూఢిల్లీ ఆర్చిబిషప్ ఓస్వాల్ట్ పిలుపునిచ్చాడు. ఇతడు వాటికన్ అనే రోమన్ సామ్రాజ్యపుప్రతినిధి. భారతదేశాన్ని క్రైస్తవీకరణం చేసేందుకు వచ్చినవాడు. బెంగళూరులో నూతన సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. వీరి లక్ష్యం ఒక్కటే- అపవిత్ర కలయికతోనైనా మోదీని గద్దె దించడం. దేశభక్తి విషయంలో ఏ పార్టీవారూ చేతులు కలపరు.
‘విధ్వంసం మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం’ అంటూ కమ్యూనిస్టులూ, ఉగ్రవాదులూ వీరంగం వేస్తున్నారు. చైనాలో ఇలాంటి తిరుగుబాట్లను సహిస్తారా? ‘మాకు ప్రజాస్వామ్యం కావాలి’ అని చైనాలో కొనే్నళ్ల క్రితం విద్యార్థులు ఆందోళన చేస్తే వారిని పిట్టల్లా కాల్చిచంపారు. చైనా, రష్యా, పాకిస్తాన్‌లో నియంతల పాలనను కొనసాగుతున్నాయి. ఇండియాలోనే ఘనమైన ప్రజాస్వామ్యం ఉంది. అది దుర్వినియోగమైంది. మెజారిటీ వర్గమైన హిందువుల్లో అనైక్కత శాపంలా మారింది. రాజకీయ నాయకులు అధికారం కోసం ఉద్యమాలు చేయిస్తారు. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ప్రత్యేక హోదా’ ఉద్యమం పేరిట జనంలో భావోద్వేగాలను రాజేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆయన ‘హోదా’ మంత్రం జపిస్తున్నాడు. తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలివిగా ముందురోజు వెళ్లి కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపి తిరిగి హైదరాబాదు వచ్చారు. ఎందుకంటే అది కాంగ్రెసు ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ కాంగ్రెసు పార్టీకి చెందినవాడు. తెలంగాణలో కెసిఆర్‌కు ప్రధాన శత్రువు కాంగ్రెసు. ఇక ఏచూరి సీతారాం (సిపిఎం),మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెసు) పక్కపక్కన కూర్చున్నారు. సిపియం కార్యకర్తలపై దాడులు జరిపించి మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చింది. వీరంతా పక్కపక్కన కూర్చుంటే ఇది ‘మహా ఘటబంధన్’ అవుతుందా? ఈ పార్టీల్లో సారూప్యత ఏమిటి? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారా? మరి ఎన్‌టిఆర్ నాటి ‘కాంగ్రెసు వ్యతిరేకత’ అనే మూలసిద్ధాంతం ఏమైనట్లు? అన్నింటికన్నా విచిత్రాంశం ఏమంటే- ‘మాకు వ్యతిరేకంగా ఎవరువచ్చినా వారిని ధ్వంసంచేస్తాం’ అని మమతా బెనర్జీ ప్రకటించటం. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన ఆమె చేసిన విధ్వంస ప్రసంగం ఎంతవరకు సమంజసం?
సెక్యులర్ గ్యాంగ్..
ఆ నేతలంతా సెక్యులరిజం పరిరక్షకులు. బెంగళూరులో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వీరు ఒకే వేదికపై విన్యాసాలు చేశారు. కేరళలో ‘ఓనం’ సంప్రదాయోత్సవాలపై నిషేధం విధించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, బెంగాల్‌లో దుర్గా పూజలు చేయకూడదంటూ గర్జించిన మమతా బెనర్జీ, తిరుమల దేవస్థానం నుండి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులును తరిమివేసిన చంద్రబాబు, అయోధ్యలో రామాలయం కట్టే హిందువులను కాల్చి చంపండని పిలుపునిచ్చిన ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్, బ్రాహ్మణ వైశ్య క్షత్రియులను చంపండని ఉద్యమం నడిపిన మాయావతి వంటివారు ఒకే వేదికపైకి చేరారు. పాకిస్తాన్ మాదిరి ద్రవిడస్థాన్ అనే ప్రత్యేక దేశం తమకు ఇవ్వాలంటూ కోరుతున్న కరుణానిధి కొడుకు స్టాలిన్, కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించండని కోరిన సీపీఎం నేత ఏచూరి సీతారాం వంటి సెక్యులర్ నాయకులంతా బెంగళూరులో జతకట్టి 2019 సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించుతారట! ఒకవేళ అదే జరిగితే విపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఎవరికివారు ఆ పదవిని చేజిక్కించుకునేందుకు ఆరాటపడుతున్నారు.
నిజానికి సెక్యులరిజం అనే మాటను ఈ రాజకీయ నాయకులు భ్రష్టుపట్టించారు. సెక్యులరిజం అంటే ‘హిందూ ద్వేషం’ అనే అర్థం వచ్చేసింది. దేశంలో దేవాలయాలు, చర్చిలు, వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఉన్నాయి. కాని దేవాలయాల ఆస్తులమీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అజమాయిషీ ఉంటున్నది. చర్చిల్లో కోట్లాది ఆస్తులు దుర్వినియోగం అవుతున్నా సెక్యులరిస్టులు పట్టించుకోరు. తిరుమల , శ్రీరంగం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాలపై సెక్యులరిస్టుల అజమాయిషీ ఎందుకు? ఆబ్కారీ వ్యాపారం చేసిన వారు, క్రైస్తవులు టిటిడి పాలక మండలి సభ్యులుగా నియమితులు కావడం న్యాయమా? తిరుమలలో స్వామివారి నగలు మాయమైనట్లు రమణ దీక్షితులు చేసిన ఆరోపణకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరుని హారంలోని పింక్ డైమండ్ జెనీవాకు చేరిందా? దానిని స్విట్జర్‌లాండ్‌లో వేలం వేశారా? ఔనని అంటున్నాడు రమణ దీక్షితులు. ‘చంద్రబాబు ఇంటికి టిటిడి నగలు చేరాయి’ అని వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. వెంకన్న సొమ్ము ఎవరైనా తింటే ఆ దేవుడు వడ్డీతో పాటు వసూలు చేసుకుంటాడు. కొన్ని దేవాలయాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. సొరంగంలో దేవుడి నగలు దాచిపెట్టారని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలి. ఈ దుర్మార్గపు రాజకీయ నాయకులకు దేవుడి సొమ్ము కావాలి.. కాని హిందూ ధర్మం అక్కరలేదు.
ఎక్కడైనా ఇలా జరిగిందా?
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని వంశధార నదీ తీరంలో కుద్దిగాం, మాకవరం అనే చిన్న గ్రామాలున్నాయి. మాకవరంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఒక భక్తురాలు దశాబ్దాలుగా సేవలు చేసుకుంటోంది. ఇటీవల ఆలయ ఉత్సవాలకు ఆమె రాలేదు. ఎందుకని ఆమెను ఆరా తీయగా- ‘నేను మతం పుచ్చుకున్నాను. గుడికి రాకూడదు’ అన్నది. వెయ్యి మంది జనాభాకూడా లేని ఆ గ్రామంలో మూడు చర్చిలు వెలిశాయి. అంటే చాపకింద నీరులా మన దేశంలో క్రైస్తవీకరణ జోరుగా సాగుతోంది.
రష్యాలో ఇమ్రీనాగీ, ట్రాయిస్కీ వంటి అగ్రశ్రేణి కమ్యూనిస్టు నాయకులు తనతో విభేదించిన కారణంగా స్టాలిన్ నిర్ధాక్షిణ్యంగా వారిని చంపించాడు. కొందరు క్రైస్తవమత పరిశోధకులు జీసస్ క్రైస్ట్ ఆర్యుడని అన్నారు. నోవాస్ ఆర్క్, హోంశాపం- టవర్ ఆఫ్ బాబెల్ కథలు బైబిల్‌లోనివి హిందు పురాణాలలోకి అనువదింపబడ్డాయి అని వాదించారు. ఇక్కడ గమనింపవలసిన అంశం ఏమంటే- వేదవ్యాసుడు 5000 సంవత్సరాల నాటివాడు. బైబిలు రెండువేల ఏళ్ల నాటిది. నోవాస్ ఆర్క్ కథ వైనస్వత మనువు వృత్తాంతంలో ఉంది. అంటే ఇది వ్యాసుని కాలానికన్నా ముందు జరిగింది. అంటే అష్టాదశ పురాణ గాథలు బైబిలులోకి ఎక్కాయని అర్థం. తల్లినుండి బిడ్డ పుడుతుంది కాని బిడ్డనుండి తల్లి పుట్టదు. కాగా, ఇటీవల మరొక ధోరణి మొదలైంది. కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు మత యుద్ధాలు చేసుకుంటున్నారు. తమకు యూదుల కాలం నాటి (జూడా) మోసెస్ మతంతో సంబంధం లేదని తమది స్వతంత్ర క్రైస్తవం అని వాదిస్తున్నారు. భారతదేశంలో మతాంతరీకరణ చెందిన వారిలో అధికశాతం మంది విద్యాగంధం లేనివారు, ఆర్థిక ప్రలోభాలకు లొంగినవారే. జీసస్ క్రైస్ట్ కృష్ణుడుగా పౌరాణిక యుగంలో మారాడని ఇంకొందరు చెపుతున్నారు. ఇది సరిగ్గా వ్యతిరిక్తం. ఎందుకంటే శ్రీకృష్ణుడు క్రీ.పూ.3000 సంవత్సరం నాటి వాడు. జీసస్ నేటికి 2000 ఏండ్ల నాటివాడు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 040- 2742 5668