సంపాదకీయం

అక్రమ ప్రమేయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మెతకదనం ప్రధాన కారణం.. జమ్మూ కశ్మీర్‌లో మానవ అధికారాలకు భంగం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్య సమితి’ వారి నివేదికలో ఆరోపించడం అన్యాయం మాత్రమే కాదు, అతార్కికం కూడ! మానవుల వౌలికమైన హక్కులకు నియంతృత్వ దేశాలలోను, రాజరిక వ్యవస్థలున్న దేశాలలోను, మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలోను, బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలున్న దేశాలలోను దశాబ్దుల తరబడి విఘాతం కలిగించింది. ఆయా దేశాల ప్రభుత్వాలను నియంత్రించడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలం కావడం అంతర్జాతీయ వాస్తవం. మానవుల వౌలిక అధికారాలకు మన దేశంలో సర్వసమగ్రమైన సంపూర్ణ భద్రత ఏర్పడి ఉంది. మన దేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్యానికి ప్రతీక. సర్వమత సమభావం మాత్రమే కాక సర్వ వైవిధ్య సమభావం అనాదిగా మన దేశంలో వికసిస్తోంది. తరతరాల ఈ హైందవ జాతీయ స్వభావానికి ఆధునిక ధ్రువీకరణ మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. ప్రభుత్వాలు బుద్ధిపూర్వకంగా ప్రజల వౌలిక అధికారాలకు మన దేశంలో భంగం కలిగించడం లేదు, కలిగిన సందర్భాలుండవచ్చు, అవి తాత్కాలిక అపవాదాలు మాత్రమే. ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులలో ఒకరిద్దరు, అధికార యంత్రాంగంలోని కొందరు దుర్మార్గులు సామాన్యుల హక్కులకు భంగం కలిగించి ఉండవచ్చు. కానీ పనికట్టుకొని ప్రజలపై దాడి చేసే రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలో లేదు. ప్రభుత్వ నిర్వాహకులను తప్పుచేసినప్పుడల్లా న్యాయ వ్యవస్థ నిరోధిస్తోంది, నియంత్రిస్తోంది- ఇలాంటి పారదర్శక రాజ్యంగ వ్యవస్థ ఉన్న మన దేశంలో చిన్న ‘ఉల్లంఘన’ జరిగినప్పటికీ అంతర్జాతీయ సమాజంలో అది ప్రచారం కాగలదు. అందువల్ల మన ప్రభుత్వాలు నిరంతరం జాగరూకతతో ఉంటున్నాయి. మన దేశంలోవలె మానవ అధికారాలకు భద్రత ఏర్పడి ఉన్న దేశం మరొకటి లేదు- కానీ మన దేశంలోని జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం మానవ అధికారాలను వమ్ముచేస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదికలో ఆరోపించడం కొన్ని దేశాల వారు మనకు వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్రలో భాగం! ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి చైనా ప్రభుత్వమన్నది ప్రచారం కాని వాస్తవం! ‘జిహాదీ’ బీభత్సకాండను పాకిస్తాన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ‘జిహాదీ’లకు సాయుధ శిక్షణ ఇచ్చి మన దేశంలోకి ఉసిగొల్పుతోంది. ఇలా చొరబడిన బీభత్సకారులు జమ్మూ కశ్మీర్‌లోని స్థానికులలో కొందరిని ‘జిహాదీ’లుగా రూపొందించారు.. ఈ కొందరి సంఖ్య వేలలో ఉంది!!
వీరందరూ మన సైనికులపై పోలీసులపై సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారు. కశ్మీర్ కల్లోలగ్రస్తం కావడానికి ఇదీ కారణం. 1947 నుంచి కొనసాగుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ కారణంగా మూడవ వంతుపై ‘జమ్మూ కశ్మీర్’ పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’- పిఓకె-లోని లక్షల హిందువులు 1947వ సంవత్సరంలో శరణార్ధులై మన అధీనంలోని జమ్మూ కశ్మీర్‌లోని, దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చేశారు. మన దేశంలో మిగలి ఉన్న జమ్మూ కశ్మీర్‌లోని లోయ ప్రాంతం నుంచి కూడ లక్షల హిందువులను పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జీహాదీ’లు చంపేశారు, తరిమేశారు. దేశమంతటా ఇస్లాం మతంతో సహా అన్ని మతాలవారు సమాన ప్రతిపత్తితో జీవిస్తున్నారు, సమాన అధికారాలను కలిగి ఉన్నారు. కానీ మన దేశంలోని కశ్మీర్ లోయ ప్రాంతంలో మాత్రం ఈ సర్వమత సమాన సమాజం నష్టభ్రష్టమైంది. అనాదిగా ‘లోయ’ ప్రాంతంలో జీవించిన హిందువులు, ఇస్లాం మతం పుట్టుక పూర్వం వేలాది సంవత్సరాలుగా అక్కడ పుట్టి పెరిగిన హిందువుల వారసులు నేడు అక్కడ లేరు. ఇస్లాం మతస్థులు మాత్రమే కశ్మీర్ లోయలో జీవిస్తున్నారు. సహస్రాబ్దులుగా వందల హిందూ దేవాలయాల ఆనవాళ్లు సైతం కశ్మీర్ ‘లోయ’లో కనిపించడం లేదు. ‘సర్వమత సమాజం’ ఉన్నప్పుడు మాత్రమే ‘సర్వమత సమభావ’ వ్యవస్థకు ఔచిత్యం. ఒకే మతం మిగిలి ఉన్న ‘కశ్మీర్ లోయ’లో సర్వమత సమభావానికి అవకాశమే లేదు, అర్థం లేదు, ఔచిత్యం లేదు. దశాబ్దుల తరబడి హిందువుల నిర్మూలన జరిగినప్పుడు ‘ఐక్యరాజ్య సమితి’ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ‘లోయ’లో మానవ అధికారాలకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని ‘సమితి’వారు వికృత స్వరాలతో ‘విలపిస్తున్నారు..’
పాకిస్తాన్‌లో జరుగుతున్న ‘అంతర్గత ఆధిపత్య సమరం’ కారణంగా ఆ దేశం కల్లోలగ్రస్తమై ఉంది. జిహాదీ ముఠాల మధ్య కుమ్ములాట సాగుతోంది. రాజకీయ పక్షాలకు వివిధ జిహాదీ ముఠాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. సైనిక దళాలలో సైతం ముఠాలు ఏర్పడి ఉన్నాయి. పాకిస్తాన్‌లో తరచు జరుగుతున్న బీభత్స ఘటనలకు ఈ ముఠాలు కారణం! దశాబ్దులపాటు బీభత్సకారులను పెంచి పోషించిన పాకిస్తాన్ భస్మాసురుని వలె భంగపడుతోంది. అందువల్ల ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స రాజ్యాంగ వ్యవస్థగా ప్రకటించాలి! అది జరగడం లేదు. ఇందుకు కారణం చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌ను బాహాటంగా సమర్ధించడం. పాకిస్తానీ జిహాదీలు మన దేశంలో జరిపిన రక్తపాతాన్ని చైనా గతంలో పరోక్షంగా సమర్ధించింది, ప్రస్తుతం ప్రత్యక్షంగా సమర్ధిస్తోంది. అఝార్ మసూద్ వంటి కరడుకట్టిన పాకిస్తానీ జిహాదీ హంతకులను చైనా బాహాటంగా సమర్ధించడం ఒక ఉదాహరణ మాత్రమే. పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్సకారుల ‘మానవ అధికారాల’కు భంగం కలిగిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొనడం చైనా వ్యూహంలో భాగం. ‘పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టులను ఉసిగొల్పడం లేదు, వారిని శిక్షిస్తోంది... వారిపై అక్రమంగా దమనకాండ సాగిస్తోంది..’ అన్న భ్రాంతిని కల్పించడం ఈ నివేదిక లక్ష్యం. పెద్ద నేరాన్ని చేసినవాడు దాన్ని కప్పిపుచ్చుకొనడానికై అదే సమయంలో తాను చిన్న నేరాన్ని చేస్తూ ఉండినట్టు ‘సాకు’- ఎలిబీ-ని సృష్టించుకుంటాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ‘బీభత్సకారుల’ హక్కులను కాలరాస్తోందని ఆరోపించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి జిహాదీ హంతకులతో ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేయడం చైనా వ్యూహం!
పాకిస్తాన్‌ను, మన దేశాన్ని ఒకే గాట కట్టడం ద్వారా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండ ‘ప్రాధాన్యాన్ని’ తగ్గించడం- ‘సమితి’ నివేదికను రూపొందించిన వారి లక్ష్యం. మన ప్రభుత్వం కూడ మానవ అధికారాలకు భంగం కలిగిస్తోందట! కరడుకట్టిన జిహాదీ హంతకుడు బుర్హన్ వణీ భద్రతాదళాల ఎదురుకాల్పులలో హతమయ్యాడు. దీనివల్ల మానవ అధికారాలకు భంగం కలిగిందన్నది ‘సమితి’ నివేదికలోని ఆరోపణ.. ఎవరి మానవ అధికారాలకు భంగం కలిగింది?? మానవులెవ్వరు? దానవులెవ్వరు?? ‘సమితి’ నివేదికను మన ప్రభుత్వం నిరసించింది, నిరాకరించింది.. కానీ ఇలాటి నివేదక రూపొందడమే మన దేశం పట్ల ‘సమితి’కి ఏర్పడి ఉన్న చులకన భావానికి నిదర్శనం. ఇది దశాబ్దులపాటు మన విధానాన్ని ఆవహించిన మెతక తనానికి ఫలితం.. చైనాను ‘సమితి’ ఇలా నిరసించలేదు.. రష్యాను, ఐరోపాను, అమెరికాను తప్పుపట్టడం లేదు..