సంపాదకీయం

మాల్‌దీవుల ‘పాఠం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్‌దీవులతో మన స్నేహ సంబంధాలు క్షీణించిపోవడానికి ప్రధాన కారణం మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2012వ సంవత్సరంలో చేసిన విధానపరమైన తప్పిదం. తిరుగుబాటు చేసిన పోలీసుల నుంచి, కిరాయి హంతకుల నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడి నిలబెట్టవలసిందిగా అప్పటి మాల్‌దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ చేసిన విజ్ఞప్తిని మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా నషీద్ అక్రమంగా పదవీచ్యుతుడయ్యాడు. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉసిగొల్పుతున్న జిహాదీ శక్తులు అప్పటి నుంచి ఇప్పటివరకు మాల్‌దీవులలో బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్-ను అమలు జరుపుతున్నాయి. ఫలితంగా మాల్‌దీవులలో చైనా పెత్తనం పెరుగుతోంది, మాల్‌దీవుల ప్రభుత్వం మన దేశం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది.. 2013 నుంచి తమ దేశంలో భద్రతా విధులను నిర్వహిస్తున్న మన దేశపు ‘గగన యుద్ధ శకటాల’ను ఉపసంహరించుకోవాలని మాల్‌దీవుల ప్రభుత్వం పట్టుబడుతుండడం ఈ వ్యతిరేకతకు పరాకాష్ఠ. నిజానికి ఈ రెండు గగన శకటాల- హెలికాప్టర్స్-ను మన ప్రభుత్వం మాల్‌దీవులకు కానుకగా ఇచ్చింది. మన సముద్ర తీర నిఘా విభాగం వారు, నౌకాదళం వారు ఈ ‘హెలికాప్టర్’లను నిర్వహిస్తున్నారు. మన నౌకాదళానికి చెందిన ఇరవై ఆరుమంది వాహన చోదకులు, ఇతర ఉద్యోగులు ఈ భద్రతా విధులను నిర్వహిస్తున్నారు. అప్పటి మాల్‌దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కోరినందువల్లనే మన ప్రభుత్వం ఈ హెలికాప్టర్‌లను, సిబ్బందిని మాల్‌దీవులకు పంపింది. ఈ హెలికాప్టర్ల, సిబ్బంది నిర్వహణ వ్యయాన్ని కూడ మన ప్రభుత్వం భరిస్తోంది. అందువల్ల మన ప్రభుత్వమే ఈ గగన శకటాలను ఉపసంహరించడానికి తనంత తానుగా పూనుకున్నప్పటికీ, ఉపసంహరించవద్దని మాల్‌దీవుల ప్రభుత్వం విజ్ఞప్తిచేయాలి. తమ దేశ సముద్రతీర భద్రతను కాపాడుకోవాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టయితే మాల్ దీవుల ప్రభుత్వం భారత్ అందిస్తున్న ఉచిత సేవలను నిరాకరించరాదు. కానీ నిరాకరిస్తుండడానికి ప్రధాన కారణం మాల్‌దీవుల ప్రభుత్వంపై చైనా పట్టుబిగిసిపోతూ ఉండడం. మాల్‌దీవులలో చైనా తన దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నాటినుంచి ‘మాల్‌దీవులు’ మనకు దూరంగా జరగడం ఆరంభమైంది. 2011వరకు మన దేశానికి మాత్రమే మాల్‌దీవులలో రాయబారి కార్యాలయం ఉండేది. బ్రిటన్ దురాక్రమిత అఖండ భారత్‌లో మాల్‌దీవులు, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడ భాగం. అందువల్ల మాల్‌దీవుల నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తరువాత శ్రీలంకకు, పాకిస్తాన్‌కు, బంగ్లాదేశ్‌కు కూడ దౌత్య కార్యాలయాలు ఏర్పడినాయి.
అందువల్ల మాల్‌దీవులలో 2011 నవంబర్‌లో చైనాకు రాయబారి కార్యాలయం ఏర్పడడం ప్రపంచ దేశాలను విస్మయ చకితులను చేసిన విపరిణామం. అరేబియా సముద్రంలోను, హిందూ మహాసముద్రంలోను ఓడలను కొల్లగొడుతున్న దొంగలతో పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ- అనుసంధానం సాధించిన తరువాత మాల్‌దీవుల ప్రాంతంలో చైనా నౌకల సంచారం మరింత పెరిగింది. రెండు దశాబ్దులకుపైగా పాకిస్తాన్ ప్రభుత్వం మాల్‌దీవులలోని యువకులకు తమ దేశంలో ‘జిహాదీ’ శిక్షణనిచ్చి వారిని బీభత్సకారులుగా తయారుచేస్తోంది. ఈ బీభత్సకారులు మాల్‌దీవులలోని నిర్జన ద్వీపాలలో స్థావరాలు ఏర్పరచుకొన్నారు, క్రమంగా మాల్‌దీవులలో పాకిస్తాన్ శిక్షిత జిహాదీల సంఖ్య పెరిగింది. అతి చిన్న దేశమైన మాల్‌దీవులలో ఈ ‘జిహాదీ’లు పట్టుసాధించడం సులభమైంది. బ్రిటన్ విముక్త మాల్‌దీవులలో దశాబ్దుల పాటు నిరంకుశ ప్రభుత్వం ఏర్పడింది. మావ్‌మూన్ అబ్దుల్ గయూమ్ అనే నేత ముప్పయి ఏళ్లపాటు మాల్‌దీవులపై ఆధిపత్యం వహించాడు. తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను జిహాదీలు 2013 ఫిబ్రవరిలో తొలగించడానికి కారణం పాకిస్తాన్, చైనా ఉమ్మడి షడ్యంత్రం.. అప్పటి నుంచి ప్రజాస్వామ్య నాటకాన్ని అభినయిస్తున్న అధ్యక్షుడు యామీన్ అబ్దుల్లా మావ్‌మూన్ అబ్దుల్ గయూమ్‌కు సమీప బంధువు..
ఓడదొంగలకు, అఫ్ఘానిస్థాన్ తాలిబన్లకు, పాకిస్తాన్ జిహాదీ ముఠాలకు మధ్య ‘ఐఎస్‌ఐ’ అనుసంధానం సమకూర్చిన సంగతి చైనాకు తెలుసు. పాకిస్తాన్, చైనా తోడుదొంగలు. అయినప్పటికీ ఓడదొంగలను ‘‘అరికట్టే’’ సాకుతో చైనా ప్రభుత్వం తమ నౌకాదళాలను శ్రీలంక నుంచి పాకిస్తాన్ వరకూ మన సముద్ర తీరాలకు సమీపంలో నిరంతరం నడిపిస్తోంది. ఓడదొంగల రూపంలోని జిహాదీలను పాకిస్తాన్ ఉసిగొల్పుతోంది.. మళ్లీ ఓడదొంగలను అదుపుచేసే నెపంతో పాకిస్తాన్ చైనాతో కలసి నౌకాదళ విన్యాసాలను కొనసాగిస్తోంది. మాల్‌దీవులకు, మన లక్షద్వీపాలకు మధ్యగల ఇరుకైన సముద్ర మార్గం భారత వ్యతిరేక కలాపాలకు ఆలవాలమైపోయింది. ఈ ప్రాంతంలోని జిహాదీలు, ఓడ దొంగలు మాల్‌దీవుల నుంచి మన దేశంలోని లక్షద్వీపాలకు చెందిన నిర్జన ద్వీపాలలోకి చొరబడే ప్రమాదం పొంచి ఉంది. ఈ విస్తృత షడ్యంత్రంలో భాగంగానే చైనా మాల్‌దీవులలో దౌత్య కార్యాలయాన్ని తెరిచింది. ఇలా చైనా ప్రభుత్వానికి దౌత్యస్థావరాన్ని ఏర్పాటు చేయడం నషీద్ ప్రభుత్వం చేసిన తప్పిదం. ఈ దౌత్య కార్యాలయం ఏర్పడిన దాదాపు సంవత్సరం తరువాత నషీద్‌ను పోలీసులు-సైనికులు- దౌర్జన్యంగా పదవి నుంచి తొలగించగలిగారు. చైనా మాల్‌దీవులలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయకుండా నిరోధించ లేకపోవడం మన ప్రభుత్వం వారి వ్యూహాత్మక వైఫల్యం.. ఈ ఏడు సంవత్సరాలలో మాల్‌దీవులలో చైనా కలాపాలు పెరగడానికి, మన ప్రభావం సన్నగిల్లిపోవడానికి ఈ వైఫల్యం మూల కారణం.. 1988లో కిరాయి హంతకులు గయూమ్ ప్రభుత్వాన్ని తొలగించారు. గయూమ్ మన ప్రభుత్వాన్ని అర్ధించాడు,. మన నౌకాదళాలు మాల్‌దీవులకు వెళ్లి ‘కిరాయి’ తిరుగుబాటును అణచివేశారు, గయూమ్‌ను పదవిలో పునఃప్రతిష్ఠించి వచ్చారు. గయూమ్ నియంత.. 2012 ఫిబ్రవరిలో నషీద్‌ను కిరాయి మూకలు అధ్యక్ష పదవి నుంచి తొలగించాయి. నషీద్ ప్రభుత్వం వారు మన ప్రభుత్వాన్ని పదే పదే సహాయం కోసం అభ్యర్థించారు. మన ప్రభుత్వం సహాయం చేయలేదు, నషీద్ ప్రజాస్వామ్య పాలకుడు!
ఇలా మన ప్రభుత్వం 2012లో చేతులను కాల్చుకుంది. చైనా తొత్తులు నషీద్‌ను తొలగించడాన్ని చూస్తూ ఊరుకుంది.. మాల్‌దీవులు అనాదిగా మన దేశంలో భాగం, నిజానికి మన లక్ష ద్వీపాల వరుసలోని ఈ మాలా ద్వీపాలలో వైదిక మతాలు బౌద్ధమతం, హైందవ సంస్కృతి సహస్రాబ్దుల పాటు పరిఢవిల్లాయి. క్రీస్తుశకం పదకొండవ శతాబ్దిలో జిహాదీలు దురాక్రమించడం, ఆ తరువాత ఐరోపా జాతులు చొరబడడం ‘మాలా ద్వీపాలు’ మన దేశం నుండి విడిపోవడానికి కారణాలు..