సంపాదకీయం

వైరుధ్యాల ఏకత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల ఐకమత్యం ప్రస్ఫుటించడం ఖాయం. ఈ ఐకమత్యం దీర్ఘకాల రాజకీయ సయోధ్యగా మారుతుందా? అన్నది మహా మీమాంసకు ప్రాతిపదిక! గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల మధ్య ‘ఏకాభిప్రాయం’ కుదిరింది. ‘సభ’లను జరుగనివ్వరాదన్నది ఈ ఏకాభిప్రాయం. మార్గాలు వేఱయినా గమ్యం ఒక్కటే అన్నట్టుగా, మాధ్యమాలు విభిన్నమైనా లక్ష్యం ఒక్కటే- అన్నట్టుగా ప్రతిపక్షాలు తమతమ పద్ధతులలో ‘బడ్జెట్ సమావేశాలు’ సజావుగా జరుగకుండా నిరోధించగలిగాయి. వేఱువేఱు సమస్యల పరిష్కారానికి వివిధ ప్రతిపక్షాల వారు విలక్షణ పద్ధతులలో ఉభయ సభలలో నినాదాలు చేశారు,ప్రదర్శనలు జరిపారు, సభల అధ్యక్షుల వేదికవద్ద నిలబడి నిరసనలు తెలిపారు, సభలు వాయిదాపడిన తరువాత కూడ సభలలోనే బైఠాయించారు. ఒక ప్రతిపక్షం పరిష్కరించదలచిన సమస్యకు, మరో ప్రతిపక్షం పరిష్కారం కోరిన సమస్యకు సంబంధం లేదు. వివిధ ప్రతిపక్షాల వారు సమాంతరంగా నిరసనలను, నినాదాలను నిర్వహించి సభలో తమ ఉనికిని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన - పార్లమెంటులోని- విపక్షాలవారు సభలు జరుగకుండా నిరోధించడంలో మరింత చురుకైన పాత్రను పోషించడం బడ్జెట్ సమావేశాల్లో సంభవించిన ప్రధాన పరిణామం. అందువల్ల ‘సభలు జరుగరాదు’ అన్న ఏకాభిప్రాయం ఘన విజయం సాధించింది. ప్రభుత్వ పక్షం వారు కూడ ప్రతిపక్ష లక్ష్యసాధనకు పరోక్షంగా ఎంతోకొంత సహకరించిన దాఖలాలు లేకపోలేదు. ఎందుకంటె సభలను ప్రతిపక్షాలు నిరోధించడం పట్ల ప్రభుత్వపక్షం వారు ఒకటి రెండు మూడు నాలుగు రోజులు సహనం వహించవచ్చు. కానీ ఆ తరువాత నిబంధనల ప్రకారం, సభా కార్యక్రమాలను అడ్డుకునే వారిని, ‘సభ’ నుంచి బయటికి పంపవచ్చు. సభలను సజావుగా నడిపించవచ్చు. కానీ అలాచేయడం ‘అప్రజాస్వామ్య’ పద్ధతి అని ప్రభుత్వం భావించింది. అలాంటి నిబంధనలను ఉపయోగించలేదు. ఇది ప్రతిపక్షాల లక్ష్యసాధనకు దోహదం చేసిన మరో అంశం. గత ఏప్రిల్ ఆరవ తేదీన ముగిసిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా దాదాపు రెండువందల యాబయి గంటల సమయం వృథా అయింది. ‘బిల్లు’లపై చర్చలకు కేటాయించిన సమయంలో లోక్‌సభ ‘ఒక శాతం’ మాత్రమే ఉపయోగించుకోగా రాజ్యసభ ‘ఆరుశాతం’ ఉపయోగించుకోగలిగింది. లోక్‌సభలో నూట ఇరవయి గంటల సమయం, రాజ్యసభలో నూట ఇరవై గంటల సమయం నష్టమైంది. గత పద్దెనిమిదేళ్లలో ఇంత గొప్ప ‘సమయ నష్టం’ జరగడం అదే మొదటిసారి-ట-! ఇదంతా ప్రతిపక్షాల ఐకమత్యం వల్ల సాధ్యమైంది.
విపక్షాల ఇలాంటి సమష్టి స్వభావం బుధవారం మొదలుకానున్న వర్షాకాల సమావేశాల సందర్భంగా మరోసారి ప్రస్ఫుటించడం ఖాయం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఐకమత్యం మరింత అనివార్యం. ఈ ఏడాది చివరిలో జరుగనున్న మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు ‘ప్రతిపక్షాల సయోధ్య’కు అనివార్యమైన ప్రాతిపదికలు. భారతీయ జనతాపార్టీని గద్దెదించాలన్నది సమష్టి లక్ష్యం.. కానీ ‘్భజపా’వ్యతిరేకత దోహదం చేస్తున్న ఐకమత్యంలో అంతర్గత వైరుధ్యాలు మెండుగా ఉన్నాయి. సభలు జరిగే సమయంలోనైనా ఈ వైరుధ్యాలు తాత్కాలికంగా తగ్గిపోవడం నాలుగేళ్లుగా నడుస్తున్న కథ. కానీ ఈ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల ‘సయోధ్య’లోని ‘వైరుధ్యాలు’ తగ్గిపోబోవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన పదమూడు ప్రతిపక్షాల సమ్మేళనం ఇందుకు నిదర్శనం. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజ్యసభ అధ్యక్షుడు, లోక్‌సభ అధ్యక్షురాలు కూడ విడివిడిగా వివిధ పక్షాల సభా నాయకులతో సమావేశాలు ఏర్పాటుచేశారు. వర్షఋతువు ‘సభలు’ సజావుగా నిర్వహించడంలో అన్యోన్య సహకారం అవసరమన్నది- యథావిధిగా- మంగళవారం నాటి సమావేశాల ఇతివృత్తం. ఈ సమావేశాలకు పూర్వరంగంగా సోమవారం జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ‘ఉమ్మడి వ్యూహం’ ఇతివృత్తం! పార్లమెంటు సమావేశాల సందర్భంగా ‘అవాంతరాలు’ ఏర్పడకుండా నిరోధించాలన్నది ఈ ఉమ్మడి వ్యూహం. అందువల్ల సభలు సజావుగా జరిగిపోగలవన్నది ఆశాభావం. తెలుగుదేశం పార్టీవారు కేంద్ర మంత్రివర్గానికి వ్యతిరేకంగా ‘వర్ష’ సభలలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ‘తాకీదు’ఇచ్చారు. ఈ తీర్మానం సంగతి కూడ ప్రతిపక్షాల సమావేశంలో కూలంకషంగా చర్చించారట. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న ‘తెదేపా’ ప్రతినిధులు ప్రతిపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ‘ఐకమత్యానికి’ సూచిక..
ఈ అవిశ్వాసానికి ప్రతిపక్షాల మద్దతును కూడగట్టదలచిన ‘తెదేపా’ సోమవారం నాటి సభకు ఎందుకు రాలేదని ఎవ్వరూ అడగలేదు. తమ అవిశ్వాస తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఇతర ప్రతిపక్షాలను విడివిడిగా కలసి విజ్ఞప్తులు చేస్తున్న ‘తెదేపా’ పార్లమెంటు సభ్యులు, నాయకులు ఉమ్మడి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు? ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. భాజపాను ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు కాంగ్రెస్‌కు దూరం దూరంగానే ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో ఏర్పడబోతున్న భాజపా వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా? ఉండదా? అన్న విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం ‘విపక్షాల ఐకమత్యాని’కి మరో విలోమ సూచిక! కర్నాటకలో హెచ్.డి.కుమారస్వామి గత మే 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకార ఉత్సవ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి, ‘తెలంగాణ రాష్టస్రమితి’ అధినేత కె.చంద్రశేఖరరావు హాజరుకాలేదు. ఆయన ముందురోజుననే బెంగళూరుకు వెళ్లి కుమారస్వామిని అభినందించి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాడు. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన ‘ఐక్య జనతాదళ్’ విధానాన్ని చంద్రశేఖరరావు హర్షించడం లేదన్నది సహజంగా కలిగిన అనుమానం! తెలంగాణలో ‘తెరాస’కు కాంగ్రెస్ ప్రబల ప్రత్యర్థి. జాతీయస్థాయిలో ఏర్పడే భాజపా వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్, తెదేపా, తెరాస చేరినట్టయితే అలాంటి కూటమిలోని అంతర్గత వైరుధ్యాలకు ఈ చేరిక ప్రబల తార్కాణం కాగలదు. అలా చేరినట్టయితే తెరాస, తెదేపా తమ ప్రాంతాలలో కూడ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటాయా? ‘అసంభవం..’అన్నది ప్రస్తుత నిర్ధారణ.. ఇంకా ఏర్పడని ‘ప్రతిపక్షాల జాతీయ కూటమి’లో ఏర్పడి ఉన్న వైరుధ్యాలివి! అందువల్ల ‘వర్ష’ సభలలో భాజపాను వ్యతిరేకించడంలో విపక్ష ఐకమత్యం వెల్లివిరిసినప్పటికీ, డొల్లతనం కూడ ముందుగానే తేటతెల్లమైపోయింది.
రాహుల్ గాంధీలో విదేశీయ రక్తం ప్రవహిస్తోంది కాబట్టి ఆయనకు ప్రధానమంత్రి పదవి దక్కదు!- ఇలా స్పష్టీకరించింది భాజపా వారు కాదు, కాంగ్రెస్‌తో జట్టుకట్టి ఉన్న ‘బహుజన సమాజ్ పార్టీ’- బసపా-వారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి సోమవారం ప్రసంగించిన ‘బసపా’ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ సింగ్ ఈ విప్లవాత్మక ప్రకటనను ఆవిష్కరించాడట. తమ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నది ఆయన కనిపెట్టిన ‘మహా విషయం’. భాజపా వ్యతిరేక జాతీయ కూటమి ఏర్పడితే- వారు మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని శిరసా వహించాలన్నది ఈ నాయకుని అంతరంగం. మాయావతి మాట బహుశా ఈయన నోట వెలువడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రాంతాల విధానసభల ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొనడానికి ‘బసపా’ ఉవ్విళ్లు ఊరుతోంది. అలాంటి మిత్రపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇలా వ్యతిరేకించడం ‘ఐకమత్యం’లోని వైరుధ్యాలకు సరికొత్త సాక్ష్యం. రాహుల్ ప్రధాని పదవికి తగడన్నది వాస్తవం. మిత్రపక్షం వారు సైతం ఈ వాస్తవాన్ని ప్రచారం చేయవచ్చునా??