సంపాదకీయం

వాణిజ్య భోజనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిరకం తినుబండారాలను ‘మన నోళ్లకెత్తుతున్న’ భోజనశాలల కలాపాలను నియంత్రించడానికి ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ’ వారు పరిశ్రమిస్తుండడం శ్లాఘనీయం. నాసిరకం భోజనాలను, అనారోగ్యకరమైన భోజన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దాదాపు పదివేల ‘్భజన శాలల’ను ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సాధకార సంస్థ’- పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- వారి ఆదేశంతో పంపిణీ సంస్థల వారు వెలివేశారట! భోజనశాలలు-మెస్‌లు రెస్టారెంటులు- ఆహారం ఉత్పత్తి చేయడానికి వీలుగా ‘సాధికార సంస్థ’వద్ద నమోదు కావాలట! అలా నమోదు అయిన తరువాత ప్రమాణాల ప్రాతిపదికగా ‘సాధికార సంస్థ’ వారు వాటికి అనుమతులను ప్రదానం చేయాలి. అప్పుడు మాత్రమే ప్రముఖ పంపిణీ సంస్థలు ‘అంతర్జాల వ్యాపారం’- ‘ఈ-కామర్స్’- ద్వారా ఈ ఉత్పాదక కేంద్రాల- రెస్టారెంట్సు-నుంచి భోజనాలను వినియోగదారులకు పంపిణీ చేయాలట! అంతర్జాల వ్యాపారం- ఈ-కామర్స్ - ఆహార రంగంలో విస్తరించిన తరువాత అనేక స్వదేశీయ సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఈ రంగంలోకి చొరబడి వినియోగదారులను కొల్లగొడుతున్నాయి. ఇలా కొల్లగొడుతున్న సంస్థలు నిజానికి ‘్భజనా’న్ని తయారుచేయవు, ఇవి కేవలం పంపిణీ సంస్థలు. ‘ఝమాటో’, ‘స్విగ్ఘీ’, ‘ఉబర్ ఈట్స్’, ‘్ఫడ్ పండా’వంటి చిత్ర విచిత్ర నామధేయాలున్న వ్యాపార సంస్థలు ‘అంతర్జాల వ్యాపారం’ ద్వారా వినియోగదారులకు భోజనాలను సరఫరా చేస్తున్నాయట! ‘కొంపలలో కూడు వండుకోవలసిన అవసరం లేదన్న’ది ఈ ‘ఈ-కామర్స్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్’ విస్తరించిన తరువాత వ్యవస్థీకృతమైపోయిన జీవన ‘విలాసం’- ఫ్యాషన్-! ‘కంప్యూటర్ సిస్టమ్’ ద్వారా కానీ ‘స్మార్ట్ ఫోన్’- లావణ్య దూరవాణి -ద్వారా కానీ ‘మీట’లను నొక్కి వినియోగదారులు ‘్భజనం’ తెమ్మని ఈ పంపిణీ సంస్థలను కోరవచ్చు! అలా మీటనొక్కిన అరగంటకో గంటకో ఈ పంపిణీ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల ఇళ్లకు తెచ్చి వేడి భోజనాలను ఇచ్చి పోతున్నారట. ‘్భజనం’ ధర మరింత వేడిగా ఉండడం సహజం. అందువల్ల పెట్టుబడులు పెద్దగా అవసరం లేని ఈ ‘ఈ-కామర్స్’ ఆహార పంపిణీ రంగంలోకి చొరబడిన ‘ఉబర్ ఈట్స్’ తదితర ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- వంట చేస్తున్న వారికి, తింటున్న వారికి మధ్య అనుసంధానాన్ని ఏర్పాటుచేశాయి. ‘వడ్డించి’ భారీగా లాభాలను దండుకుంటున్నాయి. ఇలాంటి పంపిణీ సంస్థలతో అనుసంధానం ఏర్పరచుకున్న పది వేల ఐదువందల ‘్భజన ఉత్పత్తి కేంద్రాల’- రెస్టారెంట్స్-కు ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ వారి అనుమతి పత్రం- లైసెన్స్ - లేదట! ఎందుకంటె ఈ భోజనశాలల వారు ఈ ‘సాధికార సంస్థ’వద్ద నమోదు కాలేదట! అందువల్ల సాధికార సంస్థ వారి ‘సూచన’ మేరకు ‘ఉబర్ ఈట్స్’ వంటి ఈ ఘరానా పంపిణీ సంస్థలు ఈ పదివేల ఐదువందల భోజనశాలలను తమ ‘అనుసంధాన వ్యవస్థ’ నుంచి తొలగించాయట!
తొలగింపునకు గురి అయిన ఈ పదివేల పైచిలుకు ‘రెస్టారెంట్’లు ప్రమాణాల మేరకు ‘వంట’ చేయడం లేదన్న దానికి ఏకైక ప్రాతిపదిక ఆ భోజనశాలల వారు ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ’ వద్ద నమోదు కాకపోవడం. కానీ సాధికార సంస్థ వద్ద నమోదయి ఈ ‘ఉబర్ ఈట్స్’వంటి విదేశాల ‘పంపిణీ’ సంస్థలతో అనుసంధానమై ఉన్న లక్షల భోజనశాలలు దేశమంతటా ఉన్నాయి. మరి ఈ ‘రెస్టారెంటు’లలోని ప్రమాణాలను, స్వచ్ఛతను సాధికార సంస్థ వారు ఎలా నిర్ధారించారు? మాధ్యమం ఏమిటి? ప్రాతిపదిక ఏమిటి? ‘నమోదు’-రిజిష్టర్- కావడం మాత్రమే ఆ భోజనశాలల వంటల ‘రుచి’కి, ‘శుచి’కి, భద్రతకు, శుభ్రతకు ప్రాతిపదికయా? దేశంలో ఆహార పదార్థాలను భారీగా కల్తీ చేస్తున్న సంస్థలు విదేశాల నుంచి వచ్చిపడిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలేనన్నది జనమెరిగిన రహస్యం. ‘నెజల్’, ‘పెప్సీ’ వంటి సంస్థలు కృత్రిమంగా రుచిని పెంచడం కోసం ఆహారంలోను, తినుబండారాలలోను, శీతల పానీయాలలోను భారీగా రసాయన విషాలను కలుపుతున్నాయి. నెజల్- నెస్లే-వారి ‘మ్యాగీ’ సేమ్యాలు- నూడుల్స్- మారీచ మృగాల వలె ఏళ్లతరబడి జనం నోళ్లను ఊరించాయి. ఈ సేమ్యాలలో విష రసాయనాలు భారీగా ఉన్నట్టు బయటపడింది. వివిధ ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వారు ఈ సేమ్యాలను నిషేధించడానికి చేసిన ప్రయత్నాలు వమ్మయిపోయాయి. ఏది స్వచ్ఛతకు ప్రమాణం? ఎవరు నిర్ధారించగలరు? నిర్ధారించే అధికారులకు ‘స్వచ్ఛమైన తిండి’ని సమర్పిస్తున్న సంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నట్టు సులువుగా అనుమతి పత్రాలను పొందుతున్నాయి. మరుసటిరోజు నుంచి జనానికి అంటగట్టే ఆహారం మాత్రం రసాయనాలతో భారీగా కల్తీ అవుతూనే ఉంది. ఈ దినదిన దుశ్చర్యను ఎప్పటికప్పుడు పసికట్టి అరికట్టగల వ్యవస్థ ఏదీ..?
ఆహార స్వచ్ఛతకు నిరంతరం భంగం కలిగిస్తున్న సాంకర్య పదార్థాలు దశాబ్దులుగా మన జీవన వ్యవహారంలో భాగం కావడం అసలు సమస్య. విస్తృత సాంకర్యంలో వండిన పదార్థాలలో ‘కల్తీ’ భాగం. అందువల్ల విస్తృత సాంకర్యాన్ని నిరోధించకుండా పరిమితమైన ‘కల్తీ’ని ఎలా నిరోధిస్తారు? చిన్న నిర్బంధ గృహం విస్తృత నిర్బంధ ప్రాంగణంలో భాగమయినప్పుడు, ఆ ప్రాంగణానికి విముక్తి లభించకుండా గృహానికి విముక్తి లభించడం సాధ్యం కాదు. ‘రెస్టారెంట్’లలో కాని ఇతర భోజనశాలలలో కాని స్వచ్ఛతా ప్రమాణాలు వంద శాతం పాటించడం లేదు. ఇది మొదటి వైపరీత్యం. ఒక భోజనశాలలో స్వచ్ఛతా ప్రమాణాలను వంద శాతం పాటిస్తున్నారనుకోండి.. ఈ ప్రమాణాలలో- వంటపాత్రల స్వచ్ఛత, వంట గది స్వచ్ఛత, వంట చేసేవారి శుభ్రత... కానీ- నాలుగవది అతి ప్రధానమైనది వంటకు ఉపయోగపడే ముడి పదార్థాల స్వచ్ఛత! ఈ ముడి ఆహార పదార్థాలు రసాయన విషాలతోను, ఇతర సాంకర్యాలతోను నిండి ఉండడం దేశమంతటా వ్యవస్థీకృతమైన వైపరీత్యం. ఇది రెండవది. పాలు, కూరగాయలు, మసాలా దినుసులు, ఉప్పు పప్పులు, బియ్యం, పిండి- ఇవన్నీ దశల వారీగా ఉత్పత్తిదశ నుండి వినియోగ దశవరకూ కల్తీ అవుతూనే ఉన్నాయి. గొప్పగా పేరుమోసిన వాణిజ్య సంస్థలు సరఫరా చేసే ముడి పదార్థాలు మరింతగా రసాయన కాలుష్యమయమై ఉన్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలు మొత్తం అందమైన ‘ప్లాస్టిక్’ కాగితాలలోను సంచులలోను అమరి స్వచ్ఛమైన వస్తువులుగా చెలామణి అవుతున్నాయి. ‘ప్రపంచీకరణ’, ‘సేచ్చా వాణిజ్యం’, ‘విదేశాల పెట్టుబడులు’, ‘ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ’- ఎగుమతి అయ్యే రకం ఆహార ధాన్యాలు, దినుసులు- ఇవన్నీ బహుళ జాతీయ ‘మారీచ మృగ’ వాణిజ్య సంస్థలు సృష్టిస్తున్న ‘బంగారపు వనె్నలు’..
అందువల్ల ‘పంటలు’ విష రసాయనాల ప్రభావం నుండి విముక్తం కానిదే ‘రెస్టారెంట్’లలోను, ‘మెస్సు’లలోను, ‘కాటరింగ్’ కేంద్రాలలోను వండుతున్న వంటల ప్రమాణాలు మెరుగుపడవు. ఇళ్లలో వండుకుంటున్న వంటలలో సైతం ఈ స్వచ్ఛత, పౌష్టికత, ప్రమాణాలు ఏర్పడడం కల్ల! ‘జెర్సీ’తో దేశవాలీ ఆవుల పాలు కల్తీ అయిపోయాయి.. ‘ప్లాస్టిక్’, ఎఱువులు, సబ్బులు, ఏలకులు, చక్కెరలను కలిపి పాలను తయారుచేస్తున్న ముఠాలు వెలశాయి, ఎముకల నుండి నూనెలను తయారుచేస్తున్న ‘తండాలు’ పనిచేస్తున్నాయి. ‘ప్లాస్టిక్’ బియ్యం సైతం పంపిణీలో ఉన్నట్టు ప్రచారమైంది. ఇప్పుడు విదేశాల నుండి ‘జిఎమ్’ సంకరమైన తిరుబండారాలు భారీగా దిగుమతి అవుతున్నాయి. కుంకుమ పువ్వు, పసుపు, మిరప పొడి, మిరియాలు, ఏలకులు, లవంగాలు... ఇవన్నీ ‘కల్తీ’ అయిపోతున్నాయి. ‘వంటల’ స్వచ్ఛత సాధ్యమేనా...?