సంపాదకీయం

విజయ వికాస క్రమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునరావృత్తి సృష్టి నిహిత పరిణామక్రమం. కాలం పునరావృత్తవౌతోంది, చరిత్ర పునరావృత్తవౌతోంది. స్వభావ పునరావృత్తి, స్వరూప పునరావృత్తి నిరంతరం ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థ.. ‘వెలుగు’ పునరావృత్తం కావడం ఉదయం, ‘చీకటి’ పునరావృత్తం కావడం రాత్రి! ఇది సృష్టి స్వరూప పునరావృత్తి! ‘వెలుగు’ ఉన్నప్పటి నుంచి సమాంతరంగా ‘చీకటి’ కూడ కొనసాగుతోంది. వెలుగు దివ్యత్వం, అజరామరం, చీకటి దివ్యత్వాన్ని దిగమింగడానికి యత్నించే వికృతి, అసురత్వం! అసుర భావం పదే పదే అమరతత్త్వంపై దాడి చేయడం పునరావృత్తి- రిపిటీషన్-! అసురశక్తిని అమరశక్తి ఓడించడం కూడ పునరావృత్తి! ‘విజయ దశమి’ ఈ నిరంతర ‘పునరావృత్తి’కి ప్రతీక. భారతీయుల ప్రతి ఉత్సవం ఈ చారిత్రక పునరావృత్తికి ప్రతీక! వెలుగు ఉన్నప్పటి నుంచి చీకటి కూడ ఉంది. ఏది వాంఛనీయం? అన్న ప్రశ్నకు సమాధానం పునరావృత్తికి ప్రాతిపదిక! ‘ప్రళయము’ ‘ఉదయము’ పునరావృత్తి అవుతూనే ఉన్నాయి. ప్రళయ కల్పంలో సృష్టి కనిపించదు, ఉదయ కల్పంలో సృష్టి కనిపిస్తోంది. ‘ప్రళయం’ ‘ఉదయం’ నిరంతరం పునరావృత్తం అవుతుండడం అనాది, అనంతం.. ఇదీ విశ్వవ్యవస్థ. అనివార్యమైన ఈ సృష్టిక్రమాన్ని వేదద్రష్టలు గుర్తించారు, భారతీయులు గుర్తించారు, హిందువులు గుర్తించారు! అందువల్లనే సృష్టిక్రమానికి అనుగుణమైన, ప్రకృతికి పరిపోషకమైన, విశ్వహితకర జీవన విధానం అనాదిగా హైందవ జాతీయ తత్త్వమైంది. సృష్టిలో సమాజం, సమాజంలో జీవజాలం భాగమన్న సనాతన- శాశ్వత- సత్యానికి అందువల్లనే భారతీయ ఉత్సవాలు ప్రతీకలయ్యాయి, ‘విజయదశమి’ అలాంటి సముజ్వల ప్రతీక..
రాత్రి, పగలుతోపాటు నెలలు, ఋతువులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు పునరావృత్తం అవుతుండడం విశ్వవ్యవస్థ, సృష్టిక్రమం! శరత్ ఋతువు ఇలాంటి పునరావృత్తి. వర్షఋతువులో ఆకాశం మొత్తం నీటితో ప్రక్షాళితమైపోతోంది. నిర్మలమైన ఆకాశం గుండా మరింత నిర్మలమైన సూర్యకాంతి భూమికి ప్రసరించడం శరదృతువు స్వభావం.. ‘‘స్ఫురదరుణాంశ రాగ రుచుల’’తో ‘‘కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ...’’ అన్నది మహాకవి ఎఱ్ఱన్న మహాభారతంలో చెప్పిన మాట! ఇలా శరత్ కాలంలో ‘పగలు’ అమలిన కాంతితో ప్రస్ఫుటించడం అనివార్యమైన ప్రాకృతిక పరిణామం. శరదృతువులో రాత్రులందు వెనె్నలలు కూడ మరింత తెల్లగా వెల్లివిరుస్తాయి. ‘‘శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ చారు తరంబులయ్యె..’’ అని ఆదికవి నన్నయ భట్టు చెప్పడం ఈ పునరావృత్తి క్రమం.. ఆశ్వయుజ, కార్తిక మాసాలు శరదృతువు. శరదృతువు నడికొంటున్న వేళ సంభవిస్తున్న ‘విజయదశమి’ ఇలా స్వచ్ఛతకు దర్పణం.. ఈ స్వచ్ఛతను భంగపరచడానికి యత్నించిన మాలిన్యం సహజంగానే అంతరించిపోవడం శరదృతువు! మాలిన్యం అసురశక్తి, మహిష దనుజశక్తి.. స్వచ్ఛత మహిష ‘మర్దనశక్తి, ఆదిశక్తి, అనాదితత్త్వం! మహిష దనుజుడు చీకటి, దుర్గాదేవి విశ్వవ్యవస్థను వెలుగుతో నింపుతున్న ఉదయం! చీకటి అంతరించడం, ఉదయం అవతరించడం వాంఛనీయ పునరావృత్తి, విశ్వహిత ప్రవృత్తి! ఈ ప్రవృత్తికి ప్రతీక ‘విజయదశమి’. శరన్నవరాత్రులు సముజ్వల చంద్రికలు..
కరం కరం కలసి కలసి
కాంతి వలయమవుతున్నది,
కణం కణం కలసి విశ్వ
గణం విస్తరిస్తున్నది....
చినుకు చినుకు చేరి చేరి
సరిత పరుగుతీస్తున్నది,
చేయి చేయి చెలిమి చేసి
శక్తి అవతరిస్తున్నది....
ఈ సంఘటిత శక్తి విశ్వవ్యవస్థను పరిరక్షిస్తోంది. ఈ సంఘటిత శక్తి సమన్వయాన్ని వ్యవస్థీకరించింది. ఈ వ్యవస్థను గాయపరచడానికి యత్నించే ‘దురాక్రమణ’ అహంకరించినప్పుడల్లా ‘సంఘటిత శక్తి’ అణచివేయడం విశ్వవ్యవస్థలో నిహితమై ఉన్న స్వభావం. ‘వెలుగు’ అనంత కోటి కిరణాల ‘సంఘటన’, ‘గ్రహణం’ దురాక్రమణ! ‘గ్రహణం’ అహంకరించి అంతరించిపోవడం విశ్వవ్యవస్థలో పునరావృత్తి! ‘వెలుగు’ దాడి చేయడం లేదు, దాడి చేస్తున్న చీకటిని ప్రతిఘటిస్తోంది, తిప్పి కొడుతోంది! దాడి చేసిన ‘మహిష దనుజ’ శక్తిని విశ్వనిహిత సుసంఘటిత చైతన్యశక్తి ప్రతిఘటించి పరాజయం పాలు చేయడం నిరంతర పునరావృత్తి! ఈ సృష్టిగత వాస్తవం సమాజ స్థిత జీవనంగా ప్రస్ఫుటించడం భారతీయత, అందువల్లనే హైందవ జాతి అనాదిగా దాడి చేసిన బాహ్య వికృతులను ప్రతిఘటించే సంస్కారశక్తిగా, సంఘటిత శక్తిగా విరాజిల్లడం చరిత్ర. ‘గ్రహణం’ దశాబ్దుల పాటు కొనసాగింది, కానీ విజయం వెలుగుదే, విదేశీయ దురాక్రమణ శతాబ్దుల పాటు నడిచింది. ప్రతిఘటించిన భారత జాతీయశక్తి విజయం సాధించింది. ఇది చారిత్రక పునరావృత్తి! విశ్వనిహిత ‘దుర్గ’మశక్తి ‘దనుజ’ భావంపై దాడిచేయలేదు, దాడి చేసిన దనుజ తత్త్వాన్ని దండించింది.. భారతీయ శక్తి విదేశాలపై దాడి చేయలేదు, ధ్వంసం చేయలేదు, హత్యలు చేయలేదు, కొల్లగొట్టలేదు! దురాక్రమించిన, ధ్వంసం చేసిన, హత్యలు చేసిన, కొల్లగొట్టిన విదేశీయ మహిష దానవులను భారతీయశక్తి ప్రతిఘటించింది! ఈ ‘ప్రతిఘటన’ చారిత్రక పునరావృత్తి! ఇదీ సనాతన భారత జాతీయ చరిత్ర. ఈ పునరావృత్తి సమకాలంలో సైతం ప్రస్ఫుటిస్తూ ఉండడం ‘విజయదశమి’ ఉత్సవానికి విచిత్ర నేపథ్యం.. భరతమాత దుర్గ, భరతమాత లక్ష్మి, భరతమాత సరస్వతి! విస్తృత విశ్వచైతన్యానికి విగ్రహరూపం భరతమాత, ముగురమ్మల మూలపుటమ్మ భరతమాత!!
అందువల్లనే నలువైపుల నుంచి కోరలను విసురుతున్న దురాక్రమణను ప్రతిఘటించడానికి సుసంఘటిత భారతీయ శక్తి పటిమ, పదును పెరగవలసిన చారిత్రక అవసరం ఏర్పడింది. పాకిస్తానీ జిహాదీ బీభత్సం, చైనా ప్రభుత్వ ఆధిపత్య విస్తరణ వ్యూహం మన దేశాన్ని నలువైపుల నుంచి ముట్టడించడానికి యత్నిస్తుండడం ఈ చారిత్రక పునరావృత్తి క్రమంలో వర్తమాన ఘట్టం. నేపాల్ ప్రభుత్వం ఉత్తరాన, శ్రీలంక ప్రభుత్వం దక్షిణాన చైనాకు వ్యూహాత్మక స్థావరాలుగామారి ఉండడం మోగుతున్న ప్రమాద ఘంటికలకు నిదర్శనం. పాకిస్తాన్ వంటి శత్రుదేశం చైనా స్థావరంగామారి ఉండడం విచిత్రం కాదు. కానీ దశాబ్దుల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్‌లోను, శ్రీలంకలోను, మాల్‌దీవులలోను ప్రభుత్వాలు చైనాకు అనుకూలంగా, మనకు వ్యతిరేకంగా ‘విధానాల’ను అనుసరిస్తుండడమే విస్మయకరం. ఈ పొరుగు దేశాల ప్రజలు మన దేశపు ప్రజలతో నిరంతరం మైత్రిని కోరుతున్నారు. నేపాల్‌లోని ప్రజలు మన దేశాన్ని తమకు మరో మాతృదేశంగా భావిస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక భావోద్వేగం కాదు, తరతరాల నేపాలీ జీవన వాస్తవం. శ్రీలంక ప్రజలు కూడ విస్తృత భారత సాంస్కృతిక జీవనంలో తరతరాలుగా భాగస్వాములు. ఈ జనజీవన స్వభావానికి విరుద్ధంగా అటు శ్రీలంక ప్రభుత్వం, ఇటు నేపాలీ ప్రభుత్వం చైనాతో జట్టుకట్టి మన దేశంపై విద్వేష విషం వెళ్లగక్కుతుండడం నడుస్తున్న వైపరీత్యం. తనను ‘హత్య చేయడానికి భారతీయ నిఘా సంస్థలు యత్నిస్తున్నాయని’ శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఆరోపించడం విషం వెళ్లగక్కడంలో భాగం... ఇదంతా చైనా ‘మహిష దనుజ’ దురాక్రమణలో భాగం.. పాకిస్తాన్ జిహాదీ దురాక్రమణలో భాగం... సనాతన సంస్కారశక్తి అయిన భారత్‌కు మళ్లీ దురాక్రమణ ప్రమాదం దాపురించి ఉండడం ‘విజయదశమి’కి నేపథ్యం..